మెడలో రుద్రాక్షతో ‘సిద్ధా’గా రామ్‌చరణ్‌ - acharya team introduces ramcharan as siddha
close
Updated : 17/01/2021 10:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెడలో రుద్రాక్షతో ‘సిద్ధా’గా రామ్‌చరణ్‌

పోస్టర్‌ రిలీజ్‌ చేసిన ‘ఆచార్య’ టీమ్‌

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌ ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఓ కీలకపాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూట్‌లో చరణ్‌ భాగమయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా ఓ స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేసింది. ఇందులో చరణ్‌ మెడలో రుద్రాక్ష.. చెవికి పోగుతో కనిపించారు. ఈ సినిమాలో చరణ్‌ సిద్ధా అనే పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ‘‘మన సిద్ధాకు ‘ఆచార్య’ సెట్‌లోకి స్వాగతం పలుకుతున్నాం. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌ షూట్‌లో పాల్గొంటున్నారు’ అని కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ వెల్లడించింది.

యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్‌ సందడి చేయనున్నారు. కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నటుడు సోనూసూద్‌ ఈ సినిమాలో ప్రతినాయకుడి లక్షణాలున్న పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న చెర్రీ తాజాగా ఈ సినిమా షూట్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్న విషయం విధితమే..!

ఇదీ చదవండి
నేను తెలుగింటి అల్లుడినే..!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని