నిర్మాతగా మారిన ఆలీ! - achi reddy and sv krishna reddy set to play cameos in ali’s andaru bagundali andulo nenundali
close
Published : 21/01/2021 16:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిర్మాతగా మారిన ఆలీ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: హస్యనటుడు ఆలీ నిర్మాతగా మారారు. ‘అందరూ బాగుండాలి..అందులో నేనుండాలి’ అనే చిత్రాన్ని ఆయనే నిర్మిస్తూ, ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.  అలాగే చిత్రపరిశ్రమలో ఆయనకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో నటించనున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న చిత్ర షూటింగ్‌లో వారిద్దరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘ఆలీ తొలి సారి నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుంది’ అని అన్నారు. ముగ్గురు కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. నటుడు నరేష్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. 2019 మలయాళ చిత్రం ‘వికృతి’కి ఇది రీమేక్‌. కొచ్చి మెట్రో రైలులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఆద్యంతం హస్యభరితంగా ఉండే ఆ చిత్రం మలయాళ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అలీ స్నేహితుడు శ్రీపురం కిరణ్‌ ఈ రీమేక్‌ను తెరకెక్కిస్తుండగా..అబాన్‌, మౌర్యానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇవీ చదవండి!

ఫిక్స్‌ అయిన పెళ్లి.. క్యాన్సిల్‌ అయ్యింది: షకీలా

పెళ్లికి ముందు మా ఇద్దరికి బ్రేకప్‌ అయ్యింది!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని