మహిళలపై యాసిడ్‌ దాడి హత్యకంటే దారుణం: కర్ణాటక హైకోర్టు - acid attack on women is heinous crime than murder
close
Updated : 26/07/2021 23:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహిళలపై యాసిడ్‌ దాడి హత్యకంటే దారుణం: కర్ణాటక హైకోర్టు

నాగరిక సమాజంపై దాడిగా పేర్కొన్న హైకోర్టు

బెంగళూరు: మహిళలు, చిన్నారులపై యాసిడ్‌ దాడికి పాల్పడటం  హత్య కంటే దారుణమైందని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటివాటిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఉపాధ్యాయురాలిపై యాసిడ్‌ దాడికి పాల్పడిన వ్యక్తికి జిల్లా కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు సమర్థించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. యాసిడ్‌ దాడి కేవలం బాధితురాలిపై పాల్పడిన నేరం మాత్రమే కాదు.. అది మొత్తం నాగరిక సమాజంపై చేసిన దాడిగా పేర్కొంది. మహిళలపై నేరాలకు అంతులేకుండా పోయిందని విచారం వ్యక్తంచేసింది. మహిళలు, చిన్నారులపై యాసిడ్‌ దాడి హేయమని న్యాయమూర్తులు జస్టిస్‌ బి.వీరప్ప, వి.శ్రీశానంద్‌ అభిప్రాయపడ్డారు. ‘‘మహిళ ముఖంపై యాసిడ్‌తో దాడి చేయడం కేవలం శారీరకంగా గాయపరిచినట్టే కాదు.. అది ఆమెను మానసికంగా వేదనకు గురిచేస్తుంది.  ఆమె తన ముఖాన్ని సమాజానికి చూపించుకోకుండా దాచుకోవాల్సి ఉంటుంది. ఈ యాసిడ్‌ దాడులను తల్లిదండ్రులు, భర్త, పిల్లలు లేదా సమాజం ఏమాత్రం సహించదు. యాసిడ్‌ దాడికి పాల్పడే నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’’ అని ధర్మాసనం పేర్కొంది. 

దేవనగరి జిల్లా హొన్నాళ్లికి చెందిన మహేశ్‌  అనే వ్యక్తి 2014లో బైక్‌మీద వచ్చి ఉపాధ్యాయురాలైన ఓ యువతిపై యాసిడ్‌ దాడి చేశాడు. తనను పెళ్లాడేందుకు ఆమె తిరస్కరించినందుకే యాసిడ్‌ దాడికి తెగబడ్డాడు. ఈ కేసులో జిల్లా కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 10 లక్షలు జరిమానా విధించింది. తనకు విధించిన శిక్షను అతడు హైకోర్టులో సవాల్‌ చేశాడు. దీంతో ఈ కేసు విచారణ చేపట్టిన ధర్మాసనం అతడికి విధించిన శిక్ష సరైందేనని పేర్కొంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని