కరోనా పడగ: 15 రోజుల్లో రెండింతలు ఖాయం - active covid-19 caseload in maha to double in 15 days
close
Published : 15/04/2021 19:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా పడగ: 15 రోజుల్లో రెండింతలు ఖాయం

ముంబయి: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నా, అత్యధిక ప్రభావం మహారాష్ట్రపైనే ఉంది. ఇలాంటి సమయంలో కరోనా విలయాన్ని ‘ప్రకృతి విపత్తు’గా పరిగణించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రానికి రాసిన లేఖలో రాబోయే 15రోజుల్లో కరోనా పాజిటివ్‌ కేసులు రెండింతలయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5.64లక్షల యాక్టివ్‌ కేసులు ఉండగా, ఏప్రిల్‌ 30 నాటికి ఈ సంఖ్య 11.9లక్షలకు చేరుతుందని లేఖలో వివరించారు. ఈ నేపథ్యంలో తగిన సదుపాయాలు కల్పించడానికి రాష్ట్రానికి సాయం చేయాల్సిందిగా కోరారు.

రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే రోజుకు 1,200 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం అవుతుండగా, నెలాఖరు నాటికి 2వేల మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతుందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ద్రవ రూపంలోని ఆక్సిజన్‌ రవాణాకు అడ్డంకులు ఉన్న నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ  చట్టం కింద విమానాల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరారు.

కరోనాను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం

నాగ్‌పూర్‌: కరోనాను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అభిప్రాయపడ్డారు. నాగ్‌పూర్‌లోని నేషనల్‌ క్యానర్‌ సెంటర్‌లో 100 పడకల కొవిడ్‌ ఆస్పత్రిని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుత దేశం విపత్కర పరిస్థితుల్లో ఉందని, ఇది ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమన్నారు. ఎలాంటి దారుణ పరిస్థితులు ఎదుర్కొనేందుకైనా ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు. భిలాయ్‌ నుంచి 40 టన్నుల ఆక్సిజన్‌ను నాగ్‌పూర్‌ ఆస్పత్రులకు తరలించినట్లు ఈ సందర్భంగా తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని