కరోనా.. సినిమా భాషలో చెప్పాలంటే..! - actor bhadram about second wave
close
Published : 18/04/2021 21:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా.. సినిమా భాషలో చెప్పాలంటే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ పరిణామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తనదైన శైలిలో తెలియజేశారు హాస్య నటుడు భద్రం. ఈ మేరకు ఓ వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. ‘కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా ఉంది. సినిమా భాషలో చెప్పాలంటే.. కరోనా గతేడాది సూపర్‌ హిట్ కొట్టింది. దాంతో ఈ ఏడాది సీక్వెల్‌గా సెకండ్‌ వేవ్‌ వచ్చింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు కలెక్షన్లు (కేసులు) బాగా పెరిగాయి. ఫస్ట్ వేవ్‌లో ఒకే ఒక్క విలన్.. చైనా. సెకండ్ వేవ్‌లో ఆయనతోపాటు యు.కె, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన వేరియంట్లు తదితర విలన్లు ఉన్నారు. వీళ్లందరి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. జాగ్రత్తగా ఉండటమే మనం చేయాల్సిన పని. కరోనా విషయంలో పోరాడి గెలిచిన వాడు హీరో కాదు. పోరాటం లేకుండా గెలిచినవాడే హీరో. నిజ జీవితంలో మనమందరం హీరోలు కావాలి’ అని కోరారు. ‘జ్యోతి లక్ష్మి’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘లోఫర్‌’, ‘శతమానం భవతి’, ‘చావు కబురు చల్లగా’ తదితర చిత్రాల్లో నవ్వులు పూయించారు భద్రం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని