ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లిన కమల్‌హాసన్‌ - actor kamal haasan went to mgm hospital to know about sp balasubramanyam health condition
close
Published : 24/09/2020 20:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లిన కమల్‌హాసన్‌

చెన్నై: గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియగానే, నటుడు, రాజకీయ నాయకుడు కమల్‌హాసన్‌ గురువారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లారు. కరోనా నుంచి కోలుకున్న ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి గత 24 గంటల్లో విషమించిందని ఎంజీఎం బులిటెన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎక్మోతో పాటు, ఆయనకు ప్రాణాధార వ్యవస్థ ద్వారా చికిత్స అందిస్తున్నామని ఎంజీఎం వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. బాలు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు, ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని