రజనీ అభిమానులకు మోహన్‌బాబు విన్నపం - actor mohan babu about rajinikanth health and political entry
close
Updated : 01/01/2021 13:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రజనీ అభిమానులకు మోహన్‌బాబు విన్నపం

హైదరాబాద్‌: తన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో పార్టీ ప్రారంభించి రాజకీయాల్లోకి రావాలని అనుకోవటం లేదని స్టార్‌ హీరో రజనీకాంత్‌ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. అయితే, రజనీ వయసు, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకున్నారని, ఆయన శ్రేయోభిలాషులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి విలక్షణ నటుడు మోహన్‌బాబు కూడా చేరారు. రజనీ-మోహన్‌బాబు స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజనీ రాజకీయాల్లో వెనకడుగు వేయటంపై మోహన్‌బాబు ఒక ప్రకటన విడుదల చేశారు.

‘‘రజనీకాంత్‌ నాకు అత్యంత ఆత్మీయుడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల్లో రావటం లేదని ప్రకటించారు. ఒక రకంగా తను రాజకీయాల్లో రాకపోవటం అభిమానులందరికీ బాధే. అయినప్పటికీ ఒక స్నేహితుడిగా తన ఆరోగ్యం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా ఇదే మంచి నిర్ణయమని నమ్ముతున్నా. నా మిత్రుడితో ఎన్నో సందర్భాల్లో చెప్పాను. ‘నువ్వు చాలా మంచివాడివి. చీమకు కూడా హాని చేయవు. వన్‌ ఆఫ్‌ ది గ్రేటెస్ట్‌ పర్సన్‌. నీకూ, నాకు రాజకీయాలు పనికిరావు. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా మాట్లాడతాం. ఎవరికీ ద్రోహం చెయ్యం. డబ్బులిచ్చి ఓట్లు.. సీట్లు.. కొనలేం. ఇక్కడ ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలియదు. రాజకీయాల్లోకి రానంతవరకూ మంచివాడన్న వాళ్లే, ఆ తర్వాత చెడ్డవాడంటారు. రాజకీయం రొచ్చు.. బురద.. అది అంటుకోకుండా నువ్వు రాకపోవడమే మంచిదైంది. రజనీకాంత్‌ అభిమానులందరూ ఆయనంత మంచివాళ్లు. మీరందరూ సహృదయంతో నా మిత్రుడి నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ.. - మీ మోహన్‌బాబు’’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అయితే, రజనీ సినిమాల్లో నటించాలా? వద్దా? అన్నదానిపై మాత్రం మోహన్‌బాబు ప్రస్తుతం స్పందించలేదు. రాజకీయాల్లోకి రాకపోయినా, పరిస్థితులు చక్కబడిన తర్వాత నటుడిగా వెండితెరపై అలరించాలని రజనీ అభిమానులు ఆశిస్తున్నారు.

ఇవీ చదవండి..

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని