‘బిబి’లో నేను ఉన్నా..! - actor nandu in Big boss season 4
close
Updated : 26/08/2020 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బిబి’లో నేను ఉన్నా..!

హైదరాబాద్‌: బుల్లితెర ప్రేక్షకులను మళ్లీ అలరించడానికి తెలుగు బిగ్‌బాస్‌ మరో సీజన్‌ సిద్ధమవుతోంది. రెండోసారి కూడా అగ్ర కథానాయకుడు నాగార్జున దీనికి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ తాజా సీజన్‌పై ఆసక్తిని పెంచుతోంది. ఈసారి హౌస్‌లోకి వెళ్లేవారి జాబితా ఇప్పటికే ఖరారైంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముందుగా వారందరికీ పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్‌లో ఉంచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యువ నటుడు, గాయని గీతా మాధురి భర్త నందు ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు.

‘‘డార్లింగ్స్‌ నేను బిబిలో ఉన్నా. అక్కడ మన రచ్చ మామూలుగా ఉండదు. మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ మీ ముందుకు వస్తుంది. మీ సహాయం కావాలి. మంగళవారం సాయంత్రం మరో అప్‌డేట్‌ ఇస్తా’’ అని పేర్కొన్నారు.

నందు సతీమణి గీతామాధురి కూడా ‘బిగ్‌బాస్‌ సీజన్‌2’లో పాల్గొన్నారు. చివరి వరకూ తీవ్ర పోటీ ఇచ్చిన ఆమె రన్నరప్‌గా నిలిచారు. మరి నందు బిగ్‌బాస్‌లోకి అడుగు పెట్టినట్లేనా. ఈసారి ‘బిగ్‌బాస్‌’లోకి వీరేనంటూ పలువురు పేర్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రఘు మాస్టర్‌, ఆయన భార్య ప్రణవి, మహాతల్లి, ఆమె భర్త సుశాంత్‌, హెచ్‌ఎంటీవీలో వ్యాఖ్యాత సుజాత, టిక్‌టాక్‌ స్టార్‌ అరియానా గ్లోరీ, మెహబూబ్‌ దిల్‌సే, సోహైల్‌ రియాన్‌, కరాటే కల్యాణి, లాస్య, నోయల్‌, యాంకర్‌ ప్రశాంతి, జబర్దస్త్‌ అవినాష్‌లు ఈసారి షోలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై బిగ్‌బాస్‌ టీమ్‌ నుంచి, పాల్గొనేవారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. నందూ ఒక్కడే వ్యక్తిగతంగా అభిమానులతో పంచుకున్నారు. మరి మిగిలిన గురించి తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని