Nani: మెగాఫోన్ ప‌ట్టిన నాని సోద‌రి - actor nani sister deepthi ganta started meet cute movie
close
Published : 14/06/2021 22:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nani: మెగాఫోన్ ప‌ట్టిన నాని సోద‌రి

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు నాని సోద‌రి దీప్తి గంటా ద‌ర్శ‌కురాలిగా మారారు. ‘మీట్ క్యూట్’ అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారామె. వాల్ పోస్ట‌ర్ సినిమా ప‌తాకంపై నాని స‌మ‌ర్పిస్తుండ‌గా ప్ర‌శాంతి నిర్మిస్తున్నారు. సోమ‌వారం చిత్రీక‌ర‌ణ ప్రారంభమైంది. ‘‘నేడు కొత్త ప్ర‌యాణం మొద‌లైంది. ఇది నాకెంతో ప్ర‌త్యేకం’’ అని ట్వీట్ చేశారు నాని. క్లాప్ బోర్డు ప‌ట్టుకున్న ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. స‌త్యరాజ్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇత‌ర ప్ర‌ధాన‌ తారాగ‌ణం వివ‌రాల్ని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు. గ‌తంలో ‘అన‌గ‌న‌గా ఒక నాన్న’ అనే ల‌ఘుచిత్రంతో ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ చూపారు దీప్తి. వాల్ పోస్ట‌ర్ సినిమా ప‌తాకంపై తెర‌కెక్కుతోన్న నాలుగో చిత్ర‌మిది. వైవిధ్య‌భ‌రిత చిత్రాలు ‘అ!’, ‘హిట్’ ఈ బ్యాన‌ర్‌లోనే రూపొందాయి. ‘హిట్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘హిట్ 2’ రాబోతుంది.

 
 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని