వేడుకగా సిరివెన్నెల తనయుడి నిశ్చితార్థం - actor raja got engaged
close
Updated : 17/08/2020 18:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేడుకగా సిరివెన్నెల తనయుడి నిశ్చితార్థం

హైదరాబాద్‌: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు, నటుడు రాజా చెంబోలు ఓ ఇంటివాడు కానున్నాడు. తాజాగా ఆయన నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాలు వివరిస్తూ రాజా తనకు కాబోయే భార్యతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్నారు.

‘‘ఇది 2020లో అత్యుత్తమ భాగం. కొత్త ప్రయాణం ఆనందంగా ఉంది. మీ ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు’ అంటూ ఆయన రాసుకొచ్చారు.ఈ సందర్భంగా నటుడు రాజా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు.

‘‘ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ ద్వారా ఈ సంబంధం కుదిరింది. గత రెండు నెలలుగా మాత్రమే బిందు(కాబోయే భార్య పేరు) నాకు తెలుసు. కొద్దిరోజుల్లోనే ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం. కరోనా నిబంధనల కారణంగా నిశ్చితార్థ వేడుక కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరిగింది.  బంధువులు, స్నేహితుల మధ్య ఈ వేడుక చేసుకోవాలనుకున్నా, ప్రస్తుతం పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. బహుశా అక్టోబర్‌ నాటికి పరిస్థితులు చక్కబడితే అప్పుడే మా వివాహం ఉండవచ్చు’’ అని రాజా తెలిపారు. సహ నటుడిగా రాజా తనదైన పాత్రల్లో ఒదిగిపోతున్నారు. ‘ఎవడు’, ‘ఫిదా’,‘రణరంగం’,‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని