ఆదికి కెరీర్‌ బెస్ట్‌ ఇదే: సాయికుమార్‌ - actor sai kumar special thanks to megastar chiranjeevi oke oka lokam nuvve song success meet
close
Published : 01/02/2021 23:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆదికి కెరీర్‌ బెస్ట్‌ ఇదే: సాయికుమార్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న పాటల్లో ‘ఒకే ఒక లోకం నువ్వే’ ఒకటి. శ్రీనివాసనాయుడు దర్శకత్వంలో ఆది, సురభి జంటగా నటించిన ‘శశి’ చిత్రంలోనిదీ పాట. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ మెలొడీ సాంగ్‌ యువతను బాగా ఆకట్టుకుంటోంది. చంద్రబోస్‌ రచించిన ఈ పాటకు అరుణ్ చిలువేరు స్వరాలు సమకూర్చారు. సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. అయితే.. విడుదలైన అతి కొద్దిరోజుల్లోనే ఈ పాట 20 మిలియన్లకు పైగా వీక్షణలు సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా చిత్రబృందం వేడుకలు చేసుకుంది.

ఈ కార్యక్రమంలో నటుడు సాయికుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా కథ ఇప్పటి వరకూ వినలేదు. అయితే.. ఈ పాట నాలో బాగా ఆసక్తి కలిగిస్తోంది. సినిమా టీజర్‌ విడుదల చేసిన మెగాస్టార్‌ చిరంజీవిగారికి, పాట లాంచ్‌ చేసిన తమన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ‘ప్రేమకావాలి’తో ఆది ప్రస్థానం మొదలైంది. డ్యాన్స్‌ బాగా చేస్తాడు. మంచిమంచి పాటలు వచ్చినా.. కెరీర్‌లో బెస్ట్‌ ఇదే అనుకుంటున్నా. ఇదే మొదటిది కూడా కావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అతనికి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఈ పాట కర్ణాటక, తమిళనాడులో కూడా బాగా పాపులర్‌ అయింది. చాలా సంతోషంగా ఉంది. ఈ పాటకు కారకులైన మూడు సింహాలు చంద్రబోస్‌, అరుణ్‌, సిధ్‌ శ్రీరామ్‌. అందరికీ కృతజ్ఞతలు. 2021లో అందరికీ మంచి జరగాలి. అందరి సినిమాలూ బాగా ఆడాలి. సినిమా యూనిట్‌ మొత్తం ఎంతో కష్టపడి పనిచేశారు. థియేటర్లకు వచ్చి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించండి’ అని సాయికుమార్‌ అన్నారు.

ఇదీ చదవండి..

మహాభారతం యుద్ధం లేకుండా...
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని