Sivakarthikeyan: సింహం, ఏనుగును దత్తత తీసుకున్న హీరో - actor sivakarthikeyan adopts lion elephant in vandalur zoo
close
Published : 05/09/2021 00:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sivakarthikeyan: సింహం, ఏనుగును దత్తత తీసుకున్న హీరో

చెన్నై: ‘రెమో’ చిత్రంతో తెలుగునాట అభిమానాన్ని చూరగొన్న శివకార్తికేయన్‌లో మంచి జంతు ప్రేమికుడు ఉన్నాడు. అందుకే ఈ తమిళ నటుడు తరచూ జూలో ఉండే జంతువులను దత్తత తీసుకొని వాటి పట్ల తన ప్రేమను చాటుకుంటారు. గతంలో ఓ తెల్లపులిని దత్తత తీసుకున్న కార్తికేయన్‌.. తాజాగా ఓ సింహం, ఏనుగును దత్తత తీసుకొని తన ప్రత్యేకతను చాటుకున్నారు.  తమిళనాడులోని అరిగ్నర్‌ అన్నా జంతు ప్రదర్శనశాల (వండలూరు జూ)లో విష్ణు అనే సింహాన్ని, ప్రకృతి అనే ఆడ ఏనుగును కార్తికేయన్‌ ఆరు నెలల పాటు దత్తత తీసుకున్నట్టు జూ అధికారులు వెల్లడించారు. ఈ రెండు జంతువుల బాధ్యతను తీసుకోవడం ద్వారా ఈ మూగ జీవాల సంరక్షణ పట్ల ఆయన అభిరుచి ఏమిటో తెలుస్తోందని పేర్కొన్నారు. శివకార్తికేయన్‌ గతంలో అను అనే ఓ తెల్ల పులిని కూడా 2018 నుంచి 2020 వరకు దత్తత తీసుకున్నారని తెలిపారు. ఇలాంటి దత్తత వల్ల కార్యక్రమాల వల్ల జంతువులతో అనుబంధం మరింత పెరుగుతుందని అరిగ్నర్‌ అన్నా జంతు ప్రదర్శనశాల పేర్కొంది. జంతువులను దత్తత తీసుకునాలనుకునేవారు వాటి ఆహారానికి, నిర్వహణకు డబ్బును విరాళంగా కూడా ఇవ్వవచ్చని జూ అధికారులు తెలిపారు. ఆగ్నేయాసియాలో అతిపెద్ద జంతు ప్రదర్శనశాలగా అరిగ్నర్‌ అన్నా జూ పేరు గడించింది. ఈ జంతు ప్రదర్శనశాలలో 2452 జంతువులు ఉన్నాయి.     



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని