
తాజా వార్తలు
భాను చందర్‌ను ఫోన్ చేయొద్దన్న సుమన్!
హైదరాబాద్: స్నేహం విషయంలో బాపు-రమణల్లాగే తమ బంధం కూడా గట్టిదని అంటున్నారు నటుడు భానుచందర్. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి మరో నటుడు సుమన్‌తో కలిసి ఆయన విచ్చేశారు. అమ్మ కోరిక మేరకు తాను నటుడిగా మారినట్లు ఈ సందర్భంగా భాను చందర్ చెప్పారు.
తెలుగు ప్రేక్షకులు పాటలు, ఫైట్స్ అంటే విపరీతంగా ఇష్టపడతారని, అందుకే తాము తమిళంతో పోలిస్తే, ఎక్కువగా తెలుగు చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపేవాళ్లమని తెలిపారు. ఒకానొక సందర్భంలో కొన్నిరోజుల పాటు తనకి ఫోన్ చేయొద్దని సుమన్ గట్టి చెప్పారంటూ అందుకు గల కారణాన్ని కూడా భాను చందర్ పంచుకున్నారు.
ప్రస్తుతం స్నేహం అనేది కమర్షియల్ అయిపోయిందని, అవతలి వ్యక్తిలో చెడు కనిపించినా, మార్చే ప్రయత్నం చేయాలని నటుడు సుమన్ అన్నారు. కొన్ని సార్లు బంధువుల కన్నా స్నేహితులే గొప్పవారిని చెప్పుకొచ్చారు. ఇలా భానుచందర్, సుమన్ పంచుకున్న ఆసక్తికర సంగతులు చూడాలంటే, డిసెంబరు 7వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే. అప్పటివరకూ ఈ ప్రోమోను చూసేయండి.