close

తాజా వార్తలు

Published : 27/10/2020 09:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మన హీరోలు చీర కట్టి... అదరగొట్టి!

వెండితెరపై లేడీ గెటప్‌లో అలరించిన నాయకులు వీరే!

గెటప్‌ వేయడం అంటే నచ్చని హీరోలు ఉంటారా చెప్పండి. అవకాశం దొరికితే ఓ గెటప్‌ వేసుకొని అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. ఎన్ని గెటప్‌లు వేసినా, ట్రెండ్‌ సెట్‌ చేసే గెటప్‌ మాత్రం లేడీ గెటప్పే. సినిమాలో హీరో... అమ్మాయిలా కనిపిస్తే ఆ సందడే వేరు. మన హీరోల్లో చాలా మంది అలా లేడీ గెటప్‌లో కనిపించారు. చీర కట్టి అలరించారు. ఇంకొంత మంది హిజ్రా పాత్రలో కనిపించి మెప్పించారు.

చిత్ర పరిశ్రమలో హీరోలు... అమ్మాయిల్లా కనిపించడం కొత్తేమీ కాదు. తొలినాళ్లలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు... ఇలా చాలామంది చీర కట్టి వయ్యారాలు పోయిన వారే. అయితే లేడీ గెటప్‌ అంటే ఇటీవల కాలంలో బాగా గుర్తొచ్చేది కమల్‌ హాసన్‌. ‘భామనే సత్యభామనే’లో సినిమాలో ఎక్కువ భాగం చీరలో కనిపించారు. రీసెంట్‌గా అయితే బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ‘లక్ష్మీ బాంబ్‌’ కోసం హిజ్రా గెటప్‌ కోసం చీర కట్టారు.


అక్షయ్‌ - లారెన్స్‌ ఎవరికి వారే!

దక్షిణాదిన లారెన్స్‌ చేసిన ‘కాంచన’ను హిందీలోకి ‘లక్ష్మీ బాంబ్‌’గా తీసుకెళ్లారు. ఇక్కడ లారెన్స్‌ సెకండాఫ్‌లో హిజ్రా పాత్ర కోసం చీర కట్టాడు. ఇప్పుడు ఆ పాత్రను హిందీలో అక్షయ్‌ చేశాడు. టీజర్‌లో అక్షయ్‌ను అలా చూసిన అభిమానులు వావ్‌ అంటున్నారు. సినిమాలో అంతకుమించి అలరిస్తాడని వేరేగా చెప్పక్కర్లేదు. వచ్చే నెల 9న ఈ సినిమా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలవుతోంది. అన్నట్లు ‘విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచనా...’ అంటూ లారెన్స్‌ కూడా హిజ్రా పాత్రలో అదరొగట్టిన విషయం గుర్తుందిగా. 


విక్రమ్‌ వావ్‌..

చియాన్‌ విక్రమ్‌కు ఏ గెటప్‌ వేసినా సూటవుతుందటారు సినీ ప్రేక్షకులు. ఎలాంటి పాత్రలోనైనా ఆయన ఇట్టే ఇమిడిపోగలడు. అలాంటివాడికి లేడీ గెటప్‌ పెద్ద విషయం కాదు. ‘మల్లన్న’ సినిమాలో విక్రమ్‌ చీర కట్టాడు. కనిపించింది కాసేపైనా చీరలో మెరిసిపోయాడు విక్రమ్‌. ఆ తర్వాత ‘ఇంకొక్కడు’లో నపుంసకుడిగా కనిపించి మెప్పించాడు. 


మంచు మోహిని

‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా గుర్తుందా. సినిమా మొత్తం ఒక వంతు అయితే, అందులో మనోజ్ చేసిన మోహిని పాత్ర మరో వంతు. అలా వచ్చి, ఇలా వెళ్లిపోయిన పాత్రలో మనోజ్‌ చీర కట్టులో కనిపించాడు. ఆ సినిమా వచ్చిన టైమ్‌లో ఆ గెటప్‌ సెన్సేషన్‌ అనే చెప్పాలి. సొట్టబొగ్గలు, చిలిపి కళ్లు, నిండైన చీర కట్టుతో మనోజ్‌ అదరగొట్టేశాడు. 


సత్యభామగా బాలయ్య

నందమూరి బాలకృష్ణ ఎలాంటి పాత్రలోనైనా జీవించగలరు. దేనికైనా సై అనే బాలయ్య... లేడీ గెటప్‌కి కూడా సై సై అనేశాడు. ‘పాండురంగడు’లో బాలకృష్ణ కాసేపు సత్యభామ గెటప్‌లో కనిపిస్తారు. తనదైన కులుకులు, హొయలతో చీరకట్టులో బాలయ్య అదుర్స్‌ అంతే. తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న తన నటనా కౌశలాన్ని బాలయ్య ఆ సినిమాలో మరోసారి అభిమానులకు చూపించాడు.


గుర్రం ఎగరలేదు కానీ...

సుమంత్‌ను చూస్తుంటే... అక్కినేని నాగేశ్వరరావును చూస్తున్నట్లే ఉంటుంది అంటుంటారు కొందరు. కానీ ఓ సినిమాలో సుమంత్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సుమంత్‌లో ఈ యాంగిల్‌ కూడా ఉందా అనుకున్నారు. ఆ సినిమానే ‘ఏమో గుర్రం ఎగరావొచ్చు’. అందులో ఓ పాట కోసం సుమంత్‌ ఎంచక్కా చీర కట్టుకుని శాస్త్రీయ నృత్యంతో అలరించాడు. ఆ రోజుల్లో సినిమా ఆశించినంత విజయం అందుకోకపోయినా, సుమంత్‌ గెటప్‌ మాత్రం అదిరిపోయింది.


వీరికంటే ముందు చాలా మంది కథానాయకులు చీరలో కనిపించారు. ముందుగా చెప్పుకున్నట్లు ‘భామనే సత్యభామనే’లో కమల్‌ చీర కట్టులో కనిపించారు. ‘కొండవీటి పులి’లో రజనీకాంత్‌ లేడీగెటప్‌ వేశారు. రీసెంట్‌గా అయితే ‘రోబో’ కోసం లేడీ గెటప్‌లో ఆకట్టుకున్నారు. ఓ పాటలో ఫ్యాన్సీ డ్రెస్‌తో కట్టుకున్నారు. ఇక ‘చిత్రం భళారే విచిత్రం’లో నరేశ్‌ పాత్ర, ఆ చీర కట్టు మరచిపోగలమా. ‘మేడమ్‌’లో రాజేంద్ర ప్రసాద్‌ చీర కట్టులో ఎంత చక్కగా అలరించాడో. చీరకట్టులో కాకపోయినా అమ్మాయిగా నటించిన వారిలో వెంకటేశ్‌ (‘బాడీగార్డ్‌’), అల్లు అర్జున్‌ (‘గంగోత్రి’), చిరంజీవి (చంటబ్బాయ్‌) తదితరులు ఉన్నారు.  ‘వీడొక్కడే’లో సూర్య కాసేపు లేడీ గెటప్‌లో కనిపిస్తాడు. ‘రెమో’లో శివకార్తికేయన్‌, ‘సూపర్‌ డీలక్స్‌’లో విజయ్‌ సేతుపతి, ‘ప్రియమానవలే’ లో విజయ్‌, ‘కళాకారుడు’లో సిద్ధార్థ్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ లేడీ గెటప్‌లో కనిపించారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.