కీర్తి... మీరు సింగిలా? కమిట్‌ అయ్యారా? - actress keerthy suresh twitter chatting with fans
close
Published : 05/11/2020 09:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కీర్తి... మీరు సింగిలా? కమిట్‌ అయ్యారా?

ట్విటర్‌లో నటి ముచ్చట్లు

హైదరాబాద్‌: ‘నేను శైలజా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేశ్‌. అలనాటి తార సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’తో ఆమెకు మంచి స్టార్‌డమ్‌ లభించింది. కమర్షియల్‌ సినిమాలతో కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలతోనూ అలరిస్తున్న కీర్తి సురేశ్‌ నటించిన ‘మిస్‌ ఇండియా’ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నరేంద్రనాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా కీర్తి ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఇవి..

క్వారంటైన్‌లో ఏం నేర్చుకున్నారు?

కీర్తి సురేష్‌: చిన్న చిన్న విషయాల్లోనూ సంతోషాన్ని వెతకడం.

* మీరు బరువు తగ్గడం వెనుక రహస్యం ఏంటి?

కీర్తి సురేష్‌: వర్కౌట్స్‌ చేయడం, డైట్‌ పాటించడం.

* మీ డ్రీమ్‌ ఏంటి?

కీర్తి సురేష్‌: ఇప్పుడు నేను నా డ్రీమ్‌తోనే (నటిస్తూ) జీవిస్తున్నా.

* నెగటివిటీ, ట్రోల్‌ను ఎలా ఎదుర్కొంటారు?

కీర్తి సురేష్‌: వాటిని పట్టించుకోను.

* మీరు పాన్‌ ఇండియా చిత్రంలో ఎప్పుడు నటిస్తారు?

కీర్తి సురేష్‌: త్వరలోనే అది జరుగుతుందని ఆశిస్తున్నా.

* మీ కెరీర్‌లో మీకు నచ్చిన విషయం?

కీర్తి సురేష్‌: సరికొత్త ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం. దాంతోపాటు అభిమానులు చూపించే ప్రేమ కూడా..

* సాధారణంగా మీరు మీ ఫోన్‌ను ఓపెన్‌ చేసిన తర్వాత మొదట ఏం చేస్తారు?

కీర్తి సురేష్‌: అన్‌లాక్‌ చేస్తా (నవ్వుతూ)

* మీకు హారర్‌ సినిమాలంటే ఇష్టమా? లేక కామెడీ చిత్రాలా?

కీర్తి సురేష్‌: హారర్‌ సినిమాలు చూడటం, కామెడీ సినిమాల్లో నటించడం.

* బొద్దుగా ఉండే కీర్తి సురేశ్‌ను ఎప్పుడు చూస్తాం?

కీర్తి సురేష్‌: త్వరలోనే..

* ‘సర్కారు వారి పాట’లో అవకాశం వచ్చినప్పుడు ఎలా ఫీల్‌ అయ్యారు?

కీర్తి సురేష్‌: చాలా ఎగ్జైట్‌ అయ్యా. షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా.

* జాతీయ అవార్డును అందుకుంటున్న సమయంలో ఎలా ఫీల్‌ అయ్యారు?

కీర్తి సురేష్‌: భయపడ్డా. కృతజ్ఞురాలిగా భావించా. అది నమ్మలేని అనుభూతి.

* మీకు ఇష్టమైన ఆహారం?

కీర్తి సురేష్‌: దోశ.

* మీకు ఇష్టమైన క్రికెటర్‌?

కీర్తి సురేష్‌: ధోనీ.

* మీ బలం ఏంటి?

కీర్తి సురేష్‌: ఆత్మస్థైర్యం.

* మీ మొదటి సినిమా, మొదటి సీన్‌కు ఎన్ని టేక్‌లు తీసుకున్నారు?

కీర్తి సురేష్‌: నేను జోక్‌ చేయడం లేదు. ఒక్క టేక్‌లో అయిపోయింది. ఎందుకంటే.. ఆ సీన్‌లో నేను కంగారుపడుతూ కనిపించాలి. అప్పుడు నా పరిస్థితి కూడా అదే (నవ్వుతూ).

* మీరు వయొలిన్‌ వాయించడం నేర్చుకున్నారా?

కీర్తి సురేష్‌: పాఠశాలలో ఉన్నప్పుడు నేర్చుకున్నా. కీబోర్డు కూడా ప్లే చేయగలను.

* సమంత గురించి ఒక్క మాట చెప్పండి?

కీర్తి సురేష్‌:ఒక్క మాట సరిపోదు. స్మార్ట్‌గా ఉంటారు. ప్రయోగాలు చేస్తుంటారు.

* మీకున్న టాలెంట్‌లో పనికిరానిది?

కీర్తి సురేష్‌: టాలెంట్‌ పనికిరాకుండా ఉంటుందా?

* మీరు తప్పులు చేశారా?, వాటి నుంచి ఏం నేర్చుకున్నారు?

కీర్తి సురేష్‌: తప్పుల్ని లెక్కించుకోలేం. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే బాధపడకూడదనే విషయం వాటి నుంచి నేర్చుకున్నా.

* ఒత్తిడిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు?

కీర్తి సురేష్‌: డ్రైవింగ్‌ చేస్తా, నా పెంపుడు కుక్క నైక్‌తో సమయం గడుపుతా, కప్పు ఛాయ్‌ తాగుతా.

* మీకు ఇష్టమైన ప్రదేశం?

కీర్తి సురేష్‌: దేశంలోని ప్రతి చోటు చూడాలని ఉంది.

* మిమ్మల్ని ద్వేషించే వారికి మీ సమాధానం?

కీర్తి సురేష్‌: వారు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు.

* ‘సర్కారు వారి పాట’లో పాత్రకు డబ్బింగ్‌ చెబుతారా?

కీర్తి సురేష్‌: కచ్చితంగా.

* మీ అభిమానుల గురించి?

కీర్తి సురేష్‌: నా కుటుంబంతో సమానం.

* మిమ్మల్ని మీరు వెండితెరపై చూసుకున్నప్పుడు ఎలా ఫీల్‌ అయ్యారు?

కీర్తి సురేష్‌: కలలా అనిపించింది.

* నటులు కావాలని కలకనేవారికి మీ సలహా?

కీర్తి సురేష్‌: సాధించే వరకు వదలొద్దు.

* మీకు ఇష్టమైన వెబ్‌సిరీస్‌?

కీర్తి సురేష్‌: ఫ్రెండ్స్‌.

* సింగిల్‌?, కమిటెడ్‌?

కీర్తి సురేష్‌: కమిటెడ్‌ టు వర్క్‌.

* బాల్యంలో మీ కల?

కీర్తి సురేష్‌:ఆర్డర్‌.. ఆర్డర్‌.. ఆర్డర్‌ (న్యాయమూర్తి).




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని