ఆ మూడు కోరికలు నెరవాలి - actress kritisanon about her dreams
close
Published : 09/04/2021 11:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ మూడు కోరికలు నెరవాలి

ముంబయి: వరస అవకాశాలతో దూసుకుపోతున్న బాలీవుడ్‌ యువ కథానాయికల్లో కృతిసనన్‌ ఒకరు. ఆమె చేతిలో ప్రస్తుతం బచ్చన్‌పాండే, ఆదిపురుష్‌ లాంటి భారీ చిత్రాలున్నాయి. వృత్తి జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూనే వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించాలనేది కృతి అనుసరించే విధానం. అందుకు తగ్గట్టే తన జీవితాన్ని, కెరీర్‌ను ప్లాన్‌ చేసుకుంటుందామె. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన అతి ముఖ్యమైన మూడు కోరికల్ని పంచుకుంది కృతి. ఓ పెద్ద బంగ్లా..అందులో అంతకంటే పెద్ద గార్డెన్‌...అందులో హాయిగా సేదతీరుతూ ఉదయాన్నే టీ తాగుతూ గడపాలి. రెండోది స్కై డైవింగ్‌ చేయడం. ఆ మజాని ఆస్వాదించడం. ఇక మూడోది జాతీయ స్థాయి పురస్కారం అందుకోవాలి..దాంతో పాటు చరిత్రలో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి బయోపిక్‌లో నటించాలి. ఈ మూడు కోరికలు త్వరగా నెరవేరాలని కోరుకుంటోంది. అందుకోసం కష్టపడతానంటోంది కృతి. ఆమె అక్షయ్‌కుమార్‌తో కలిసి నటిస్తున్న ‘బచ్చన్‌పాండే’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ‘మిమీ’, టైగర్‌ ష్రాఫ్‌తో ‘గనపథ్‌’, ‘భేడియా’ చిత్రాల్లో నటిస్తోంది కృతి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని