ప్రగ్యాజైశ్వాల్‌ని చుట్టుముట్టిన యాచకులు - actress pragya jaiswal mobbed by street children
close
Updated : 04/07/2021 15:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రగ్యాజైశ్వాల్‌ని చుట్టుముట్టిన యాచకులు

వైరల్‌గా మారిన వీడియో

హైదరాబాద్‌: ‘పోకిరి’ సినిమాలో ధర్మం చేయమని కోరుతూ అలీ, వేణుమాధవ్‌ అండ్‌ కో బ్రహ్మానందం వెనుకపడటాన్ని తెరపై చూసి నవ్వుకున్నాం. కానీ, ఇప్పుడు అలాంటి ఘటనే హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌కు ఎదురైంది. సెలూన్‌కి వెళ్లి వస్తోన్న ఆమెను కొంతమంది యాచకులు చుట్టుముట్టారు. భోజనం చేయడానికి డబ్బుల్లేవని.. దానం చేయమని కోరారు. దాంతో ప్రగ్యా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వాళ్లకు కొంత డబ్బు ఇచ్చి అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారు.

తాజాగా ప్రగ్యా సెలబ్రిటీ హెయిర్‌స్టైలిష్ట్‌ ‘హకీం అలీమ్‌ సెలూన్‌’కు వెళ్లారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన ప్రగ్యాని చూసిన కొంతమంది యాచకులు వెంటనే ఆమెను చుట్టుముట్టారు. ఆకలిగా ఉందని.. కొంత డబ్బు దానం చేయమని కోరారు. షాక్‌కు గురైన ప్రగ్యా అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. తనని మొదట కారు ఎక్కనిస్తే.. డబ్బు ఇస్తానని మాట ఇవ్వగానే.. యాచకులు పక్కకు తప్పుకున్నారు. వెంటనే కారు ఎక్కిన ప్రగ్యా తన బ్యాగ్‌లో నుంచి కొంత డబ్బు తీసి వాళ్ల చేతికందించారు. అయినా సరే వాళ్లు ఇంకొంత ఇవ్వమని కోరడంతో ఆమె ఏం మాట్లాడకుండా బయలుదేరబోయారు. కానీ, యాచకులు మాత్రం ఆమె కారుని పట్టుకుని దాని వెంటే పరిగెత్తారు. చివరికి చేసేదేమీ లేక ఆమె ఇంకొంత డబ్బు వాళ్లకి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె బాలయ్య సరసన ‘అఖండ’ చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ’ ఆఖరి షెడ్యూల్‌ త్వరలోనే మొదలుకానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని