Rakul: కెమెరాలు మోస్తూ కొండలెక్కాం.. కరణం మల్లీశ్వరిగా చేయటం లేదు: రకుల్‌ - actress rakul preet singh interview on kondapolam movie
close
Published : 06/10/2021 23:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rakul: కెమెరాలు మోస్తూ కొండలెక్కాం.. కరణం మల్లీశ్వరిగా చేయటం లేదు: రకుల్‌

‘ఉప్పెన’ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న చిత్రం ‘కొండపొలం’.  క్రిష్ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌. పల్లెటూరి యువతి ఓబులమ్మగా సరికొత్త పాత్రలో నటిస్తోంది. అక్టోబర్ 8న ‘కొండపొలం’ థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ ర‌కుల్‌ ప్రీత్ సింగ్ చెప్పిన విశేషాలు..

ఓబులమ్మ కోసం బరువు తగ్గలేదు

‘‘కరెంటు తీగ’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘ఖాకీ’....  సినిమాల్లో పల్లెటూరి అమ్మాయి పాత్రలు పోషించా. ‘కొండపొలం’లో నాది భిన్నమైన పాత్ర. గొర్రెలు కాసే అమ్మాయిగా క‌నిపిస్తా. నన్ను నమ్మి ఓబులమ్మ పాత్ర ఇచ్చినందుకు క్రిష్‌కి థ్యాంక్స్. ‘కొండపొలం’ సినిమా కోసం నేనేమీ బరువు తగ్గలేదు. క్రిష్ కథ చెప్పేందుకు ఇంటికి వచ్చినప్పుడు.. ‘చాలా యంగ్‌గా ఉన్నావ్.. నాకు కావాల్సింది ఇదే’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా కథ చాలా నచ్చింది. ఇంత వరకూ భారతీయ సినీ చరిత్రలో ఇలాంటిది చిత్రం రాలేదు. అందుకే కథ విన్న వెంటనే ఓకే చెప్పేశాను. మినీ జంగిల్ బుక్ లాంటి చిత్రమిది’’

వైష్ణవ్‌ తేజ్‌కి తపనెక్కువ

‘‘రాయలసీమ యాసలో మాట్లాడేందుకు చాలా కష్టపడ్డాను.  నగలు లేకుండా, ఒకే ర‌కం దుస్తుల్లో కనిపించే యువతి పాత్ర పోషించా. అడ‌విలో  గొర్రెలను నియంత్రించడం చాలా కష్టం. నేను, వైష్ణవ్ ఇద్దరం చాలా కష్టపడ్డాం. సాయంత్రం వచ్చే సరికి మా నుంచి కూడా గొర్రెల వాసన వచ్చేది. నాలుగైదు రోజుల్లోనే గొర్రెలు కాయడం తెలిసింది. లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లోనే ఉన్నాం. ఆ తరువాత వెంటనే అడవిలో షూటింగ్ అంటే చాలా ఆనందంగా అనిపించింది. నాకు కరోనా రాక ముందే ఈ సినిమా షూటింగ్ చేశాం. దాదాపుగా సింగిల్ షెడ్యూల్‌లోనే చిత్రీకరణ పూర్తయింది. వికారాబాద్‌లోని రిసార్ట్‌లోనే బస చేశాం. రాత్రి పూట షూటింగ్ చేసేందుకు పర్మిషన్ లేదు. అందుకే ఉదయాన్నే షూటింగ్‌ చేశాం. మా కేరవాన్‌లు ఎక్కడో రోడ్డుపైన ఉండేవి. మేం అడవిలో షూటింగ్ చేసేవాళ్లం. లంచ్ టైంలో అక్కడికి వెళ్లాలంటే ట్రెక్కింగ్ చేసినట్టుగా అనిపించేది. అలా నాకు వర్కౌట్లు కూడా అయ్యేవి.  వైష్ణవ్ తేజ్ కళ్లు పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఒదిగి ఉంటాడు. నేర్చుకోవాలనే తపన ఎక్కువ. డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నించాను కానీ కుదరలేదు’’

కెమెరాలు మోస్తూ వెళ్లాం

‘‘ఓబులమ్మ పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. క్రిష్ గారికి, నాకు ఈ పాత్ర ఎంత ఇష్టమో.. అందరికీ అలానే నచ్చుతుంది. లెహంగా ధరించి అడవిలో నడుస్తూ వెళ్లడమే కష్టం. అలాంటిది.. పెద్ద పెద్ద కెమెరాలను మోస్తూ షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లేవాళ్ల ప‌రిస్థితి మీరే ఆలోచించండి. వాటిని మోస్తూ కొండలు ఎక్కి చిత్రీకరణ జరుపుకొన్నాం. కీరవాణి సంగీతం అద్భుతంగా ఉంది. ఓబులమ్మ పాట నాకు చాలా ఇష్టం. నటనలో సవాలు విసిరే పాత్రలు చేయాలని ఉంది. అందుకే ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నాను. ‘కొండపొలం’లా నచ్చిన పాత్రలు వస్తే ఎక్కడైనా నటిస్తాను’’

తెలుగమ్మాయి అనుకుంటారు

‘‘ఓటీటీ ఆఫర్లు కూడా వస్తున్నాయి. కానీ, ఇప్పటి వరకూ వేటిని అంగీకరించలేదు. ఒకవేళ చేస్తే కచ్చితంగా పాథ్‌ బ్రేకింగ్‌లా ఉండాలి. కరణం మల్లీశ్వరీ సినిమా చేస్తున్నాను అని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. ఇప్పుడు బాలీవుడ్ ప్రాజెక్ట్ ల‌తో బిజీ. ప్రస్తుతం ముంబయిలోనే ఉంటున్నాను. అక్కడందరూ నన్ను తెలుగమ్మాయి  అని అనుకుంటారు. వచ్చే ఏడాది ఆరు చిత్రాలు విడుదదల కాబోతోన్నాయి. వాటి ఫలితమెలా ఉంటుందో చూడాలి.  జీవితాంతం ప్రేక్షకులు గుర్తు పెట్టుకొనే సినిమాలు చేయాలని ఉంది. డీడీఎల్‌జే (దిల్ వాలే దుల్హానియా లేజాయెంగే),  బాహుబలి లాంటి సినిమాలు చేస్తే చాలు. అలాంటి కేటగిరిల్లో ‘కొండపొలం’ కూడా ఉంటుందని న‌మ్ముతున్నాను. నిర్మాత రాజీవ్ రెడ్డి ఎక్కువగా మాట్లాడరు. కానీ ఆయన ప్ర‌తీది గమనిస్తుంటారు. వారితో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని రకుల్‌ చెప్పుకొచ్చారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని