ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేశా - actress rashisingh interview
close
Published : 17/03/2021 12:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేశా

హైదరాబాద్‌: ‘‘నటిగా ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా లవ్, థ్రిల్లర్, డ్రామా.. ఇలా అన్ని జానర్లలో నటించాలనుకుంటున్నా’’ అంది రాశీ సింగ్‌. ‘శశి’ చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెడుతోన్న కొత్త అందం ఆమె. ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా నటించారు. శ్రీనివాస్‌ నాయుడు నడికట్ల దర్శకుడు. ఆర్‌.పి.వర్మ, సి.రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈనెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్లతో మాట్లాడింది రాశీ.

‘‘నా స్వస్థలం రాయ్‌పూర్‌. చిన్నప్పటి నుంచీ నటనపై ఆసక్తి ఉండేది. టీవీల్లో ధారావాహికలు, సినిమాలు చూసి అందులోని పాత్రల్ని అద్దం ముందు ప్రాక్టీస్‌ చేస్తుండేదాన్ని. నా ఆసక్తి గమనించే అమ్మ నన్ను నటిని చేయాలనుకుంది. నాకు మొదటి నుంచీ సొంత కాళ్లపై నిలబడటమంటేనే ఇష్టం. అందుకే ఇటువైపు రావడానికి ముందు ఓ ఏడాది పాటు ఇండిగో ఎయిర్‌ లైన్స్‌లో ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేశా. ఆ సమయంలో హైదరాబాద్‌కు వచ్చా. తర్వాత సినీ ప్రయత్నాలు మొదలుపెట్టా. ఈ క్రమంలోనే పూరీ కనెక్ట్స్‌ ద్వారా ఈ చిత్రంలో అవకాశం అందుకున్నా’’

‘‘తెలుగులో నాకిది రెండో సినిమా అయినా.. ప్రేక్షకుల ముందుకొస్తున్నది తొలి చిత్రమిదే. ఓ విభిన్నమైన ప్రేమ కథాంశంతో రూపొందింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ కథలో తమని తాము చూసుకుంటారు. నేనిందులో సునీత అనే గాయనిగా కనిపిస్తా. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నా.’’
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని