ఇన్నేళ్ల నిరీక్షణ ఇప్పుడు ఫలించింది: రేణుదేశాయ్‌ - actress renu desai re entry with adhay web series
close
Published : 26/10/2020 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇన్నేళ్ల నిరీక్షణ ఇప్పుడు ఫలించింది: రేణుదేశాయ్‌

హైదరాబాద్‌: ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలు రేణు దేశాయ్ చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. మహిళల సాధికారత నేపథ్యంగా ఆద్య అనే వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రీకృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై డీఎస్ రావు నిర్మాతగా నూతన దర్శకుడు కృష్ణ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. నాలుగు భాషల్లో నిర్మించనున్న ఆద్య వెబ్ సిరీస్‌ను హైదరాబాద్‌లోని డీఎస్ రావు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్త సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు నీలకంఠ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా... భాగమతి దర్శకుడు అశోక్ ముఖ్య అతిథిగా హాజరై ఆద్య బృందానికి అభినందనలు తెలిపారు. వచ్చే నెల నుంచి చిత్రీకరణ జరుపుకోనున్న ఆద్య 12 ఎపిసోడ్స్‌గా ప్రేక్షకులను అలరించనుంది.

ఈ సందర్భంగా రేణు దేశాయ్‌ ప్రత్యేకంగా ముచ్చటించారు. ప్రొడక్షన్, డైరెక్షన్, కథ ఈ మూడు కలిసి వస్తేనే తాను మళ్లీ తెరపైకి రావాలనుకున్నానని చెప్పారు. అలా ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత ఆద్య వెబ్ సిరీస్ కథ నచ్చి ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలిపారు. మహిళా సమస్యలపై ఆద్య వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నట్లు తెలిపిన రేణు దేశాయ్.... ప్రేక్షకులతో శభాష్ అనిపించుకునేలా తమ సిరీస్ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆద్య వెబ్ సిరీస్‌తో పాటు తన తదుపరి చిత్రాలపై రేణుదేశాయ్ ‘ఈటీవీ భారత్‌’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. రేణు పంచుకున్న విశేషాలను ఈ వీడియోలో చూడండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని