Cinema News: నెటిజన్లపై ‘జెర్సీ’ నటి ఆగ్రహం - actress sanushas fitting reply to abusive comments on her body
close
Published : 11/06/2021 18:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: నెటిజన్లపై ‘జెర్సీ’ నటి ఆగ్రహం

తిరువనంతపురం: బాలనటిగా తెరంగేట్రం చేసి నటిగా ప్రేక్షకుల్ని అలరించిన మలయాళీ భామ సనూష నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నన్ను అనే ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి.. మీరేం పర్‌ఫెక్ట్‌ కాదు’ అంటూ అసహనం ప్రదర్శించారు. ఇటీవల ఈ భామ ఫిట్‌నెస్‌ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించి నాజుగ్గా మారారు. ఈ క్రమంలోనే తన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో పలువురు నెటిజన్లు ఆమెపై నెగెటివ్‌ కామెంట్లు చేశారు. శరీరాకృతి గురించి అసభ్యంగా పోస్టులు పెట్టారు.

వీటిపై తాజాగా సనూష స్పందించారు. ‘నా శరీర బరువు గురించి నాకంటే ఎక్కువగా బాధపడుతున్న వారందరికీ చెప్పేది ఒక్కటే.. ఎదుటివాళ్ల వైపు వేలెత్తి చూపిస్తే మిగిలిన చేతి వేళ్లు మిమ్మల్నే చూపిస్తాయి. కాబట్టి, ఎదుటివాళ్లను అనే ముందు గుర్తుపెట్టుకోండి.. మీరేం పర్‌ఫెక్ట్‌ కాదు’ అని అన్నారు. ‘బంగారం’తో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైన సనూష.. ‘రేణిగుంట’, ‘జీనియస్‌’ చిత్రాలతో మెప్పించారు. ఈ మధ్యకాలంలో విడుదలైన ‘జెర్సీ’లో జర్నలిస్ట్‌ పాత్రలో ఆమె ఆకట్టుకున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని