హీరోయిన్‌ స్నానానికి బిస్లరీ వాటర్‌ - actress sri vidya want bisleri water for bath
close
Published : 13/03/2021 15:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హీరోయిన్‌ స్నానానికి బిస్లరీ వాటర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: షూటింగ్‌ సమయంలో హీరోయిన్లకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. స్టార్‌ కథానాయిక అయితే, వాటి జాబితా ఇంకాస్త పెరుగుతుంది. తినే ఆహారం నుంచి నిద్రపోయే మంచం వరకూ అన్నీ నాణ్యమైన వాటినే అందించాల్సి ఉంటుంది. అలా కొన్నిసార్లు నిర్మాతకు అదనపు భారం తప్పదు.

అలనాటి నటి శ్రీవిద్య అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆమె ప్రసిద్ధ గాయని ఎం.ఎల్‌. వసంతకుమారి కుమార్తె. ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్నప్పుడు అవుట్‌డోర్‌ షూటింగ్‌కి రాజమండ్రి దగ్గరలోని గ్రామానికి వెళ్లారు. ఉండటానికి ఏర్పాట్లు బాగానే ఉన్నా, స్నానాలు మాత్రం పక్కనే ఉన్న గోదావరి నీళ్లతో చేయాల్సి వచ్చింది. వరదల కారణంగా నీరు బురదగా ఉండటంతో ఒక రకమైన కాయను అరగదీసి కలిపితే బురద కిందకు పోయి, స్వచ్ఛమైన నీరు పైకి తేలేది. నిర్మాణశాఖలోని సహాయకులు ఆ నీరే పట్టి నటీనటులకి స్నానానికి అందించేవారు.

కానీ, శ్రీ విద్య మాత్రం ఆ నీటితో స్నానం చేసేందుకు అంగీకరించలేదు. ఎంత తేటగా ఉన్నా, ఇంకా వరద బురద కలిసే ఉంటుందని, ఈ నీటితో స్నానం చేస్తే, తన శరీర సొగసు పాడవుతుందని, ఆరోగ్యం దెబ్బ తింటుందని పేచీ పెట్టారు. దాంతో అందరికీ తాగడానికి ఇస్తున్న ‘బిస్లరీ’ నీటిని తెప్పించి, బకెట్లలో పోసి ఇవ్వమన్నారు. బిస్లరీ వాటర్‌ అప్పుడే మార్కెట్‌లోకి కొత్తగా వచ్చింది. అప్పుడు లీటరు సీసా ఆరు రూపాయాలు. అలాంటి సీసాలు రెండు బకెట్లకి సరిపడా చిత్ర నిర్మాతలు తెప్పించి రెండు పూటలా శ్రీవిద్య స్నానానికి అందించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని