ప్రభాస్‌కు జోడీగా ఈమె ఫిక్స్‌ - adipurush heroine announcement
close
Updated : 12/03/2021 08:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌కు జోడీగా ఈమె ఫిక్స్‌

వైరల్‌గా మారిన ఆదిపురుష్‌ ఫొటోలు

హైదరాబాద్‌: రాముడి పాత్రలో ప్రభాస్‌ కనిపించనున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓంరౌత్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన ఎవరు నటించనున్నారనే విషయంలో గత కొన్నిరోజుల నుంచి సందిగ్ధత నెలకొని ఉంది. ఈ క్రమంలోనే అనుష్క శెట్టి, కీర్తిసురేశ్‌ పేర్లు కూడా వినిపించాయి. కాగా, ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌కు జంటగా సీత పాత్రలో కృతిసనన్‌ నటిస్తున్నారని చిత్రబృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. అలాగే, బాలీవుడ్‌ నటుడు సన్నీసింగ్‌ లక్ష్మణుడిగా నటించనున్నారు.

‘ఆదిపురుష్‌’ టీమ్‌లోకి కృతిసనన్‌, సన్నీసింగ్‌లకు స్వాగతం పలుకుతూ శుక్రవారం ఉదయం చిత్రబృందం కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. అందులో ప్రభాస్‌, కృతిసనన్‌, సన్నీసింగ్‌ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరోవైపు పాన్‌ ఇండియా మూవీగా రూపుదిద్దుకోనున్న ‘ఆదిపురుష్‌’లో బీటౌన్‌ స్టార్‌హీరో సైఫ్‌ అలీఖాన్‌ రావణుడి పాత్ర పోషించనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని