ఆ కథను సినిమాగా చేయడం ఎంతో కష్టం - adipurush is a tough film to make
close
Updated : 24/02/2021 14:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ కథను సినిమాగా చేయడం ఎంతో కష్టం

ప్రభాస్‌ ఎంతో శ్రమిస్తున్నారు: ఓంరౌత్‌

ముంబయి: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న అద్భుత చిత్రం ‘ఆదిపురుష్‌’. బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ రూపొందించనున్న ఈ సినిమా పూజాకార్యక్రమం ఇటీవల ముంబయిలో వేడుకగా జరిగింది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రానున్న ఈ సినిమా గురించి తాజాగా దర్శకుడు ఓంరౌత్‌ స్పందించారు. ‘ఆదిపురుష్‌’ కథను ఓ సినిమాగా సిద్ధం చేయడం ఎంతో క్లిష్టమైన వ్యవహారమని అన్నారు.

‘‘దీనిని ఒక సినిమాగా తెరకెక్కించడం కొంచెం కష్టమైన విషయం. నాతోపాటు ప్రపంచంలో ఉన్న ఎంతోమందికి ఈ కథ అవసరం. టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ప్రేక్షకులకు ఈ కథ చెప్పనున్నాను. రామాయణం గురించి ఎంతోమందికి తెలుసు. ఇప్పటికే ఎన్నోసార్లు వాళ్లు వెండితెరపై ఆ కథను చూసి ఉంటారు. కాబట్టి, ఇప్పుడు మరలా ప్రేక్షకుల్ని థియేటర్‌కు తీసుకువచ్చేలా సినిమా తెరకెక్కించాలి. నా జీవితంలోని ఎన్నో సందేహాలకు రామాయణం చదివినప్పుడు సమాధానం దొరికింది. అలా, ‘ఆదిపురుష్‌’ చూసి ప్రేక్షకుడు సైతం ఓ మంచి సందేశంతో ఇంటికి చేరుకోవాలి.’’

‘‘ప్రభాస్‌ని కలవడం కోసం ఓసారి హైదరాబాద్‌కు వెళ్లాను. నన్ను కలవడానికి ఓ సందర్భంలో ప్రభాస్‌ ముంబయికి వచ్చారు. కథకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫోన్ కాల్స్‌, వీడియోకాల్స్‌తో ద్వారా చర్చించాను. ప్రభాస్‌ పలు నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. అలాగే రోజుకు రెండుసార్లు వర్కౌట్లు చేస్తూ బిజీగా ఉంటున్నారు.’’ అని ఓంరౌత్‌ వివరించారు. గుల్షన్‌ కుమార్‌, టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్‌కుమార్‌, కిషన్‌ కుమార్‌, ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌లు నిర్మిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. కృతిసనన్‌ కథానాయికగా నటించనున్నట్లు టాక్‌. వచ్చే ఏడాది ఆగస్టు 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని