adipurush: లంకేశుడి షూటింగ్‌ పూర్తి - adipurush latest update
close
Published : 09/10/2021 23:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

adipurush: లంకేశుడి షూటింగ్‌ పూర్తి

ఇంటర్నెట్‌ డెస్క్‌: యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆదిపురుష్’‌. ఆయన శ్రీరాముడిగా కనిపిస్తుండగా, సీతగా కృతి సనన్‌ నటిస్తున్నారు. లంకేశుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ చేస్తున్నారు. ‘తానాజీ’ లాంటి సూపర్‌ హిట్‌ ఇచ్చిన ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ను దర్శకుడు పంచుకున్నారు. లంకేశుడి పార్ట్‌ చిత్రీకరణంతా పూర్తైయినట్లు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘నీతో చిత్రీకరణ సరదాగా సాగింద’ని  సైఫ్‌కు సెట్లో వీడ్కోలు పలుకుతున్న ఫోటోలను పంచుకున్నారాయన. ఈ నెలాఖరులోపు ప్రభాస్‌ పార్ట్‌ కూడా పూర్తిచేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో చిత్రబృందం బిజీ అవనున్నట్లు సమాచారం. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది ఆగస్టు 11న ‘ఆదిపురుష్‌’ థియేటర్లలోకి రానుంది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని