ఏప్రిల్‌ 12న ‘మేజర్‌’టీజర్‌ విడుదల  - adivisesh major film teaser locks its on april 12
close
Published : 10/04/2021 13:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 ఏప్రిల్‌ 12న ‘మేజర్‌’టీజర్‌ విడుదల 

ఇంటర్నెట్‌ డెస్క్: అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మేజర్‌’. ముంబయి దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా తెరకక్కుతున్న ఈ సినిమాకి శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ+ఎస్‌ మూవీస్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా చిత్రానికి సంబంధించి శోభిత ధూళిపాళ్ల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఏప్రిల్‌ 12 సాయంత్రం 4:05 నిమిషాలకు టీజర్‌ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ పోస్టర్‌లో శోభిత 26/11 ముంబయి దాడుల్లో అమ్మాయిని పట్టుకొని భయంతో సాయం కోసం ఎదురుచూస్తున్న ఎన్నారై బందీగా కనిపిస్తోంది. మహేష్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్, ప్రకాష్‌రాజ్‌, రేవతి, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.  దీన్ని తెలుగు, హిందీ, మలయాళంలో జులై 2న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఇండో - చైనా సరిహద్దుతో పాటు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనూ చిత్రీకరణ జరుపుకొంది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని