46 ఏళ్ల తర్వాత.. అదే లొకేషన్‌లో - after 46 years amitabh at same location
close
Published : 08/02/2021 21:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

46 ఏళ్ల తర్వాత.. అదే లొకేషన్‌లో

ముంబయి: కెరీర్‌ తొలినాళ్లలో నటించిన ఓ లొకేషన్‌లో 46 ఏళ్ల తర్వాత ఇదే రోజున (ఫిబ్రవరి 8) మరో సినిమాకు పనిచేయడం మధురానుభూతినిచ్చిందని తెలిపారు బిగ్‌ బీ అమితాబ్‌.  ఆయన నుంచి రాబోతున్న చిత్రం  ‘మేడే’. అజయ్‌ దేవగణ్‌ దర్శకత్వం వహిస్తూ.. ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ప్రస్తుతం అమితాబ్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ముంబయిలోని  ఓ ప్రాచీన భవంతి దగ్గర షూట్‌ చేసిన కొన్ని దృశ్యాల్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు అమితాబ్‌. 1975లో ఇదే లొకేషన్‌లో ‘దీవార్‌’ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారాయన. ‘అదే కారిడార్‌.. అదే ప్రాంతం.. నా ఎన్నో చిత్రాలు ఇక్కడే షూటింగ్‌ జరుపుకొన్నాయి. ఈ రోజు ఇలా! దీవార్‌ సినిమాలో శశికపూర్‌ (రవివర్మ) తన సోదరుడు అమితాబ్‌ (విజయ్)ని షూట్‌ చేసే సన్నివేశం ఇక్కడే చిత్రీకరించారు. ఇప్పుడు అక్కడే  ‘మేడే’ షూటింగ్‌ జరుగుతుండటం గొప్ప అనుభూతి ’అని ట్వీట్‌ చేశారు. రెండు సినిమాల చిత్రీకరణ ఫొటోలు షేర్‌ చేశారు. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.నటనా ప్రస్థానంలో ఉన్నత శిఖరాల్ని తాకిన బిగ్‌బీ ఎక్కిన మెట్లు మరిచిపోరు అనడానికి ఇదొక ఉదాహరణ.

ఇదీ చదవండి..

బొమ్మలు కొనిచ్చి నాతో సినిమా చేయించారు

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని