‘దృశ్యం-3’ త్వరలో సిద్ధం! - after drishyam 2 drishyam 3 confirmed. director jeethu joseph reveals climax ready
close
Updated : 25/02/2021 20:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘దృశ్యం-3’ త్వరలో సిద్ధం!

కొచ్చిన్‌: ఫ్యామిలీ డ్రామాలో క్రైమ్‌ థ్రిల్లర్‌ను మిళితం చేసి బ్లాక్‌బస్టర్‌ కొట్టిన చిత్రం ‘దృశ్యం’. మొదటగా మలయాళంలో జీతూజోసెఫ్‌ డైరెక్షన్‌లో మోహన్‌లాల్‌, మీనా ప్రాధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. అక్కడ సూపర్‌హిట్‌ అవ్వడంతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్‌ అయ్యింది. ఆయా భాషల్లో కూడా అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఇటీవలే ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ప్రైమ్‌లో విడుదలైన ‘దృశ్యం-2’  సైతం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. డైరెక్టర్‌ జోసెఫ్‌ తన టేకింగ్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశారు. తాజాగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే ‘దృశ్యం-3’ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నాయని, ముఖ్యంగా పార్ట్‌-3 క్లైమాక్స్‌ విన్న మోహన్‌లాల్‌, నిర్మాత ఆంటొనీ పెరంబువర్‌ ఎంతో ఆసక్తి కనబరచారని పేర్కొన్నారు. అయితే స్క్రిప్ట్‌ను మరింత ఆకట్టుకునేలా మలచాలంటే రెండు, మూడేళ్లు పడుతుందన్నారు.  కచ్చితంగా మూడో సీక్వెల్లో కూడా ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తామని భరోసా ఇచ్చారు. ‘దృశ్యం-2’ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే హిందీలో అజయ్‌దేవ్‌గణ్‌, టబు సీక్వెల్‌లో నటించేందుకు అంగీకారం తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని