కొవిడ్‌ తీవ్రతను గుర్తించేందుకు కృత్రిమమేధ - ai-based software tool for automated diagnosis of covid-19 lung infection
close
Updated : 21/02/2021 04:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ తీవ్రతను గుర్తించేందుకు కృత్రిమమేధ

పరికరాన్ని తయారు చేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ పరిశోధకులు

బెంగళూరు: కరోనా వైరస్‌ సంక్రమించిన వ్యక్తుల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ తీవ్రతను కనుగొనేందుకు బెంగళూరులోని ఐఐఎస్సీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌) పరిశోధకులు ఒక సాఫ్ట్‌వేర్‌ పరికరాన్ని తయారు చేశారు. కృత్రిమమేధ ఆధారంగా పనిచేసే ఈ పరికరాన్ని నార్వేలోని ఓస్లో యూనివర్సిటీ హాస్పిటల్, యూనివర్సిటీ ఆఫ్‌ అడ్జెర్‌ సహకారంతో అభివృద్ధి చేసినట్లు వారు తెలిపారు. దీనికి సంబంధించిన పత్రాలు ఇటీవల ఐఈఈఈ ట్రాన్సాక్షన్స్‌ ఆన్‌ న్యూరల్‌ నెట్‌వర్క్‌ అండ్‌ లెర్నింగ్‌ సిస్టమ్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ మేరకు ఐఐఎస్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఆ పరికరానికి ఆనమ్‌నెట్‌ అనే పేరును పెట్టారు.‘‘కొవిడ్‌-19 కారణంగా అనేక శ్వాస సంబంధిత సమస్యలతో పాటు, ఊపిరితిత్తుల కణజాలాలకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఎక్స్‌రే, సీటీ స్కాన్ల ఆధారంగా వైద్యులు దానిని గుర్తిస్తున్నారు. ఈ ఆనమ్‌నెట్‌ ఒక ప్రత్యేక న్యూట్రల్‌ నెట్వర్క్‌ ఆధారంగా ఆ ఎక్స్‌రేలను చదివి కరోనా వైరస్‌ తీవ్రతను గుర్తిస్తుంది.’’ అని ఐఐఎస్సీ పరిశోధకులు వెల్లడించారు. దీని ఆధారంగా వేగంగా చికిత్స అందించేందుకు వీలుంటుందని వారు తెలిపారు. ఆనమ్‌నెట్‌ కచ్చితత్వంతో పని చేసి ఊపిరితిత్తుల్లో కరోనా తీవ్రతను గుర్తిస్తుందన్నారు.

ఈ ఆనమ్‌నెట్‌ తేలికగా ఉంటుందని వారు తెలిపారు. దీని ఆధారంగా కొవిసెగ్‌ అనే మొబైల్‌ యాప్‌ను తయారుచేస్తున్నట్లు వారు వెల్లడించారు. త్వరలో దీన్ని బ్రెయిన్‌ స్కాన్‌ కూడా చేసేందుకు అనుగుణంగా మార్చుతామన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని