యూకేకు AirIndia విమానాలు రద్దు  - airindia cancels flights to uk
close
Updated : 21/04/2021 14:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూకేకు AirIndia విమానాలు రద్దు 

దిల్లీ: కరోనా ఉద్ధృతి దృష్ట్యా భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై ఇంగ్లాండ్‌ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూకేకు వెళ్లే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది. ఏప్రిల్‌ 24 నుంచి 30 వరకు భారత్‌-యూకే మధ్య విమానాలు రద్దు చేస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. 

‘‘భారత్‌, యూకే మధ్య ప్రయాణించే ప్యాసింజర్లకు గమనిక.. యూకే ఇటీవల ప్రకటించిన ఆంక్షల నేపథ్యంలో ఏప్రిల్‌ 24 నుంచి ఏప్రిల్‌ 30 వరకు బ్రిటన్‌కు విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నాం. 24-30 తేదీల్లో దిల్లీ, ముంబయి నుంచి యూకేకు వారానికి ఒక విమానాన్ని నడిపేందుకు ప్రణాళికలు చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెబ్‌సైట్‌, మా సోషల్‌మీడియా ఛానళ్లలో అప్‌డేట్‌ చేస్తాం. విమానాల రీషెడ్యూలింగ్‌, రీఫండ్‌ తదిరత వివరాలను కూడా త్వరలోనే తెలియజేస్తాం’’అని ఎయిరిండియా బుధవారం ట్వీట్‌ చేసింది.

దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతుండటంతో బ్రిటన్‌ ఇటీవల భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై పలు ఆంక్షలు విధించింది. ప్రయాణాల విషయంలో భారత్‌ను రెడ్‌లిస్ట్‌లో చేర్చిన యూకే.. ఆ దేశం నుంచే వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా 10 రోజుల పాటు హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని