మార్చి వరకు 80శాతం విమానాలే.. - airlines permitted to fly only 80 pc of pre-covid flights till march-end: govt
close
Published : 11/02/2021 20:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్చి వరకు 80శాతం విమానాలే..

వెల్లడించిన కేంద్ర విమానయాన శాఖ

దిల్లీ: కరోనా ముందు నడిచిన విమానాల్లో కేవలం 80శాతం విమానాలే మార్చి 31 వరకూ నడిపేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర విమానయానశాఖ గురువారం ఆదేశాలిచ్చింది. మార్చి తర్వాత నుంచి వేసవి ప్రయాణాలు ప్రారంభమవుతుండటంతో డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) వేసవి, శీతాకాల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ‘‘కరోనా కారణంగా 80శాతం విమానాలు నడిపేందుకు డిసెంబరు 3, 2020న కేంద్రం అనుమతిచ్చింది. తాజాగా నిర్ణయాన్ని మార్చి 31, 2021 వరకూ పొడిగిస్తున్నాం.’’ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా కారణంగా మార్చి 23 నుంచి భారత్‌లో జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలను నిలిపేశారు. ఆ తర్వాత మే 25 నుంచి 33శాతం విమానాలను అనుమతిస్తూ కేంద్రం ఆదేశాలిచ్చింది. తాజాగా ఆ ఆదేశాలను కేంద్రం మరోసారి పొడిగించింది. తర్వాత జూన్‌ 26న దానిని 45శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 2న 60శాతం, నవంబరు 11న 70శాతం, డిసెంబరులో 80శాతానికి పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి కాలంలో విమాన సంస్థలు ప్రత్యేక విమానాలు, ప్యాకేజీలు ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తూ ఉంటారు. కాగా ఈ వేసవి ప్రయాణాలపై కేంద్రం ఎటువంటి ప్రకటనా చేయలేదు.

మరోవైపు భారత్‌లో అంతర్జాతీయ విమాన ప్రయాణాలను గతేడాది మార్చి 23 నుంచి ప్రభుత్వం రద్దు చేసింది. జులై నుంచి కొన్ని ఎయిర్‌బబుల్‌ ఒప్పందంలో భాగంగా కొన్ని దేశాలకు విమాన ప్రయాణాలకు అనుమతినిచ్చారు.

ఇవీ చదవండి..

చిన్నారికి కష్టం.. చలించిన మోదీ

కుల్‌దీప్‌ ఎంపికలో పక్షపాతమా?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని