‘పొన్నియన్‌ సెల్వన్‌’ నటి ఐశ్వర్య లక్ష్మికి కరోనా - aishwarya lekshmi tests positive for covid-19
close
Published : 09/04/2021 14:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పొన్నియన్‌ సెల్వన్‌’ నటి ఐశ్వర్య లక్ష్మికి కరోనా

ఇంటర్నెట్‌ డెస్క్: దేశంలో కొద్దిరోజులుగా కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌తో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి కరోనా బారిన పడింది. ప్రస్తుతం ఆమె కేరళలోని తన ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంది. వైద్యుల సూచన మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటోంది. ఐశ్వర్య లక్ష్మి మలయాళ, తమిళ చిత్రాల్లో నటించారు. ‘యాక్షన్‌’ చిత్రంలో హీరో విశాల్‌ ప్రేమికురాలిగా నటించింది. ప్రస్తుతం ఆమె తెలుగులో సత్యదేవ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘గాడ్సే’లో కథానాయిక. ఆమె నటిస్తోన్న తొలి తెలుగు చిత్రం ఇదే. దీనికి సి.కల్యాణ్‌  నిర్మాత. ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘జగమే తంత్రం’తో పాటు, మణిరత్నం పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్‌ సెల్వన్’లోనూ నటిస్తోంది. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని