Aishwarya Rai: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో ఐష్‌ గెటప్‌ చూశారా? - aishwarya rai bachchan on the sets of ponniyin selvan
close
Published : 24/08/2021 21:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Aishwarya Rai: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో ఐష్‌ గెటప్‌ చూశారా?

ముంబయి: నటి ఐశ్వర్యరాయ్‌ నటిస్తోన్న తదుపరి చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ఈచిత్రం రెండుభాగాలు పీఎస్‌-1, పీఎస్‌-2 గా రాబోతుంది. మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా పీఎస్-1లో ఐష్‌ ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. 47ఏళ్ల ఐష్‌.. అందమైన రాణి గెటప్‌లో పట్టు ఎర్రచీర, నగలతో మెరుస్తూ కనిపిస్తోంది. ఇటీవలే పుదుచ్చేరిలో జరిగిన షూటింగ్‌లో ఆమె పాల్గొంది. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందుతోంది. కాగా ఈ చిత్రం తొలిభాగం 2022లో విడుదల కానుంది. ప్రముఖ నటులు విక్రమ్‌, కార్తీ, త్రిష, ప్రకాశ్‌ రాజ్‌, జయం రవి తదితరులు ఇందులో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సుభాస్కరన్‌ సమర్పణలో మణిరత్నం నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం ఎ.ఆర్‌. రెహమాన్‌, కళ: తోట తరణి,కూర్పు: అక్కినేని శ్రీకర్‌ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: ఎస్‌. రవి వర్మన్‌.

మణిరత్నంతో నాలుగో చిత్రం ఇది..
1997లో విడుదలైన ‘ఇరువర్‌’ చిత్రంతో ఐష్‌ను తమిళ చిత్ర సీమకు పరిచయం చేశారు దర్శకుడు మణిరత్నం. ఆ తరువాత వీరి కలయికలో.. 2007లో వచ్చిన ‘గురు’, 2010లో వచ్చిన ‘రావణ్‌’ వచ్చాయి. పదేళ్ల తరువాత.. నాలుగోసారి వీరిద్దరూ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’తో మళ్లీ ప్రేక్షకులను పలకరించనున్నారు.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని