ఐశ్వర్యను గుర్తు చేసుకున్న అజయ్‌ దేవ్‌గణ్‌! - ajay devgn and aiswarya rai celebrates 22 years of sanjay leela bhansali hum dil de chuke sanam
close
Published : 18/06/2021 18:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐశ్వర్యను గుర్తు చేసుకున్న అజయ్‌ దేవ్‌గణ్‌!

ఇంట‌ర్నెట్ డెస్క్‌: అజ‌య్ దేవ్‌గ‌ణ్.. ఐశ్వ‌ర్య‌ను గుర్తు చేసుకోవ‌డం ఏంటి? ఎందుకు? అనే సందేహంలో ఉన్నారా? అవునా.. అయితే ఇది చదివేయండి. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఐశ్వ‌ర్య రాయ్ క‌లిసి న‌టించిన తొలి చిత్రం ‘హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్’. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన‌ ఈ సినిమా నేటితో 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1999 జూన్ 18న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా నాటి జ్ఞాప‌కాల్ని గుర్తు చేసుకుంటూ, ఆ సినిమా కోసం ఐశ్వ‌ర్య రాయ్‌తో దిగిన ఫొటోని అభిమానుల‌తో పంచుకున్నాడు అజ‌య్‌. ‘‘హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్‌కి 22 సంవ‌త్స‌రాలు. స‌ల్మాన్ ఖాన్‌, ఐశ్వ‌ర్య రాయ్‌, సంజ‌య్ భ‌న్సాలీ.. నేనూ క‌లిసి ఓ మంచి సినిమా చేస్తున్నామ‌ని తెలుసు. కానీ అది చ‌రిత్ర సృష్టిస్తుంద‌ని అప్పుడు అనుకోలేదు’’ అని తెలిపారు. ఇదండీ సంగ‌తి!

రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం అందుకుంది. ఈ సినిమాలో స‌ల్మాన్ ఖాన్.. స‌మీర్ అనే కీల‌క పాత్రలో క‌నిపించారు. నందిని ద‌ర్బార్‌గా ఐశ్వ‌ర్య‌, వ‌న్రాజ్‌గా అజ‌య్ న‌ట‌న ప్రేక్ష‌కుల్ని క‌ట్టిపడేసింది. తొలి సినిమాతోనే సూప‌ర్ హిట్ జోడీగా నిల‌వ‌డంతో అజ‌య్‌- ఐశ్వ‌ర్య కాంబినేష‌న్‌లో ‘ఖాకీ’, ‘హ‌మ్ కిసిసే క‌మ్ న‌హీ’, ‘రెయిన్ కోట్’ త‌దిత‌ర సినిమాలు వ‌చ్చాయి. ఇన్నేళ్ల‌కు సంజ‌య్‌, అజ‌య్ మ‌రోసారి క‌లిసి ప‌నిచేస్తున్నారు. ఆలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో సంజ‌య్ తెర‌కెక్కిస్తోన్న ‘గంగూబాయి క‌తియావాడి’లో కీల‌క పాత్ర పోషిస్తున్నారు అజ‌య్. ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని