RRR: 60కోట్లతో బంగ్లా కొన్న నటుడు - ajay devgn buys a bungalow worth rs 60 crore
close
Published : 31/05/2021 22:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: 60కోట్లతో బంగ్లా కొన్న నటుడు

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌ నటుడు అజయ్ దేవ్‌గణ్ నిర్మాతగా, దర్శకుడిగాను రాణిస్తున్నారు. వివిధ ఉత్పత్తులకు ప్రకటనకర్తగానూ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అజయ్‌ ముంబయిలో ఓ విలాసవంతమైన బంగ్లా కొనుగోలు చేశారు. దీని ఖరీదు ఎంతో తెలుసా.. అరవై కోట్ల  రూపాయలు. ముంబయిలోనే ఖరీదైన జుహు ప్రాంతంలో కపోల్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్ దాదాపు 590 గజాల విస్తీర్ణంలో ఉంటుందని చెప్పుకొంటున్నారు. దీనిని గత ఏడాది మే నెలలోనే వీరేంద్ర దేవగణ్‌, విశాల్‌ దేవగణ్‌ పేర్లతో రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఈ బంగ్లా పుష్ప వాలియా అనే వ్యక్తికి చెందినది. ఇప్పుడు దీని ధర డెబ్భై కోట్ల వరకు ఉంటుందట. కరోనా కారణంగా తక్కువ రేటుకే కొనుగోలు చేసి ఉంటారని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు చెప్పుకుంటున్నట్లు వినికిడి. ఇప్పటికే బంగ్లాను సొంతం చేసుకున్న అజయ్‌ పునర్నిర్మాణ పనులు కూడా ప్రారంభించారని సమాచారం. ఈ ప్రాంతంలోనే అమితాబ్ బచ్చన్, హృతిక్‌ రోషన్‌, ధర్మేంద్ర, అక్షయ్ కుమార్‌ నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం అజయ్‌ - రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు గురువుగా నటిస్తున్నారని సమాచారం. హిందీలో ‘థ్యాంక్‌ గాడ్‌’ అనే హాస్య చిత్రంలో నటిస్తూనే ‘మేడే’ సినిమాలో నటన, దర్శకత్వం, నిర్మాణ పనులు చూసుకుంటున్నారు. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌తో పాటు రకుల్‌ ప్రీత్‌సింగ్ కూడా నటిస్తోంది. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని