Ajay Devgn: రూ.400కోట్ల బడ్జెట్‌.. కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే కథ! - ajay devgn dream project budget nearly cost 400
close
Published : 14/09/2021 12:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ajay Devgn: రూ.400కోట్ల బడ్జెట్‌.. కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే కథ!

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌దేవ్‌గణ్‌ చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. సుమారు ఏడెనిమిది చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ఆయన ప్రస్తుతం ‘మేడే’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం తర్వాత ఆయన దర్శకత్వంలో మరో భారీ బడ్జెట్‌ చిత్రానికి సన్నాహాలు మొదలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ కొత్త చిత్రానికి రూ.400కోట్లు బడ్జెట్‌ అనుకుంటున్నట్టు సమాచారం.

‘‘ఎన్నాళ్ల నుంచో అజయ్‌ మనసులో ఓ స్టోరీ లైన్‌ ఉంది. తాజాగా దాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం కొంతమంది రచయితల బృందం ఆ కథపై పని మొదలుపెట్టింది. ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే కథ ఇది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ బడ్జెట్‌ను అంచనా వేశారు. భవిష్యత్తులో పరిస్థితులను బట్టి మరింత పెరిగే అవకాశం కూడా ఉంది’’అని అజయ్‌దేవ్‌గణ్‌ సన్నిహితులు చెప్పినట్టు సమాచారం.

ప్రస్తుతానికి అజయ్‌ నుంచి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’, ‘మైదాన్‌’, ‘థ్యాంక్‌ గాడ్‌’, చాణక్య, సింగమ్‌ 3, గోల్‌మాల్‌ 5 చిత్రాలు రాబోతున్నాయి. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌లో అజయ్‌ చేయనున్న సినిమా కొంత ఆలస్యమయ్యేలా ఉంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని