అజయ్ ‘రుద్ర’లో రాశిఖన్నా! - ajay devgn raashii khanna to make digital crime thriller movie rudra sets in july
close
Published : 10/06/2021 17:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అజయ్ ‘రుద్ర’లో రాశిఖన్నా!

ఇంటర్నెట్‌ డెస్క్: అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ చిత్రం ‘రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌’. రాజేష్‌ మపుస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌‌, బీబీసీ స్టూడియోస్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశిఖన్నా కీలక పాత్రలో నటించనుంది. ఇప్పటికే ఎన్నో పోలీసు పాత్రల్ని పోషించిన అజయ్‌ ఈ వెబ్‌ సిరీస్‌లో పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. క్రైమ్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా జులై 21 సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమా షూటింగ్‌ ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో రెండునెలల పాటు చిత్రీకరణ జరుపుకోనుందని సమాచారం. ఇందులో రాశిఖన్నా తెలివిగల ఉన్నాద సైకో - హంతకురాలిగా కనిపించనుందట. రాశి నటిస్తున్న తొలి డిజిటల్‌ చిత్రం కూడా ఇదే కానుంది. సినిమా డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ ఓటీటీ వేదికగా విడుదలకానుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ చిత్రం బ్రిటీష్‌ వెబ్‌ సిరీస్‌గా వచ్చిన ‘లూథర్‌’ ఆధారంగా తెరకెక్కుతోంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని