Covid-19 వాక్సిన్‌ తీసుకున్న రహానె - ajinkya rahane takes covid-19 vaccine
close
Published : 08/05/2021 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid-19 వాక్సిన్‌ తీసుకున్న రహానె

(Photo: Ajinkya Rahane Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె శనివారం కొవిడ్‌-19 వాక్సినేషన్‌ తొలిడోస్‌ తీసుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ట్వీట్‌ చేసి వెల్లడించాడు. ఈ సందర్భంగా టీకా తీసుకుంటున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. అలాగే అర్హత కలిగిన ప్రతిఒక్కరూ రిజిస్ట్రేషన్‌ చేసుకొని కరోనా టీకా తీసుకోవాలని సూచించాడు. కాగా, ఇంతకుముందే టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి వాక్సినేషన్‌ చేయించుకున్న సంగతి తెలిసిందే.

మరోవైపు రహానె ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో కోహ్లీ లేని టీమ్‌ఇండియాని ముందుండి నడిపించాడు. అడిలైడ్‌లో ఘోర పరాభవం తర్వాత బాక్సింగ్‌ డే టెస్టులో శతకంతో చెలరేగి ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలోనే 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించాడు. ఇక తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో రహానె పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అర్ధశతకం సాధించాడు. ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌, ఇంగ్లాండ్‌ పర్యటనకు వైస్‌కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని