హిట్‌ కాంబో.. వరుసగా మూడోసారి? - ajith and vinoth together for hatrick
close
Published : 29/04/2021 15:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హిట్‌ కాంబో.. వరుసగా మూడోసారి?

చెన్నె: ప్రముఖ నటుడు అజిత్‌, దర్శకుడు హెచ్‌. వినోద్‌ కాంబినేషన్‌కి కోలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉందనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘నేర్కొండ పార్వై’ ఘన విజయం అందుకోవడమే ఇందుకు కారణం. ఆ వెంటనే వినోద్‌కి మరో అవకాశం ఇచ్చారు అజిత్‌. అదే ప్రస్తుతం తెరకెక్కుతోన్న ‘వలిమై’ చిత్రం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇంకోపక్క ఇదే కాంబినేషన్‌లో మరో చిత్రానికి రంగం సిద్ధమవుతోంది. వినోద్‌ దర్శకత్వంలోనే అజిత్‌ మరోసారి నటించేందుకు పచ్చజెండా ఊపారని కోలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. వలిమై విడుదల తర్వాత ‘అజిత్‌ 61’ వర్కింగ్‌ టైటిల్‌తో కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఇలా అజిత్‌ ఒకే దర్శకుడితో వరుసగా మూడు చిత్రాలు చేయడం విశేషమే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని