Ajith: ముచ్చటగా మూడోసారి? - ajith team up once again h vinoth
close
Published : 16/06/2021 10:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ajith: ముచ్చటగా మూడోసారి?

హైదరాబాద్‌: కథానాయకుడు అజిత్‌.. దర్శకుడు హెచ్‌.వినోద్‌ల కలయికలో మరో కొత్త చిత్రం రానుందా? ‘వాలిమై’ పూర్తయిన వెంటనే ఆ సినిమా పట్టాలెక్కుతుందా? అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. ప్రస్తుతం అజిత్‌ - వినోద్‌ల కలయికలో ‘వాలిమై’ సినిమా సెట్స్‌పై ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. ‘నెర్కొండ పార్వ్యై’ వంటి హిట్‌ తర్వాత ఈ ముగ్గురి కలయికలో తెరకెక్కుతున్న రెండో చిత్రమిది.

ఇంకా మూడు రోజుల చిత్రీకరణ మిగిలి ఉంది. ఇది పూర్తయిన వెంటనే.. ఈ క్రేజీ కాంబినేషన్‌లో మరో కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుందని సమాచారం. దీనికీ బోనీ కపూరే నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. రెండు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేయడమే లక్ష్యంగా దీన్ని పట్టాలెక్కించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని, ‘వాలిమై’ పూర్తికాగానే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుందని కోలీవుడ్‌ చెబుతోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని