అభిమానుల్లారా..! కాస్త ఓపిక పట్టండి  - ajith upset over his fans
close
Updated : 16/02/2021 16:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అభిమానుల్లారా..! కాస్త ఓపిక పట్టండి 

చెన్నై: తన అభిమానుల తీరుపై ప్రముఖ తమిళ నటుడు అజిత్‌ అసహనం వ్యక్తం చేశారు. సినిమాకు సంబంధించి అప్‌డేట్‌ సరైన సమయంలోనే వస్తుందని, అప్పటి వరకు ఓపిక పట్టాలని కోరారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘సినిమా అనేది మీకు వినోదం మాత్రమే. కానీ, నాకు మాత్రం వృత్తి. నేను చేసే పనిమీదే నా ఆలోచనలు ఆధారపడి ఉంటాయి. మనం చేసే పనుల వల్లే సమాజంలో మనకు గౌరవం దక్కుతుంది. పబ్లిక్‌ కార్యక్రమాల్లో సినిమా గురించి అలా అడగటం భావ్యంకాద’ని పేర్కొన్నారు.

అజిత్‌ నటిస్తున్న ‘వాలిమై’ సినిమాకు సంబంధించి అప్‌డేట్‌ కావాలంటూ సామాజిక మాధ్యమాల్లో  కొందరు అభిమానులు చిత్రబృందంపై ఒత్తిడి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా చెన్నైలోని చిదంబరం స్టేడియానికి వచ్చిన ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ మొయిన్‌ అలీని సైతం ‘వాలిమై’ అప్‌డేట్‌? అంటూ అడిగేశారు. ఆటలో నిమగ్నమై ఉన్న అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. ఆ వీడియో వైరల్‌ అయింది.

వీటికి స్పందించిన నిర్మాత బోనీ కపూర్‌ ‘వాలిమైపై మీరు చూపిస్తున్న ప్రేమకు గర్వంగా ఉంది. ఫస్ట్‌లుక్‌ తీసుకొచ్చే పనిలోనే ఉన్నాం’ అని ట్వీట్‌ చేశారు. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో రాబోతున్న చిత్రమిది. పోలీసు పాత్రలో కనిపించనున్నారు అజిత్‌. హ్యూమా ఖురేషీ నాయిక. తెలుగు యువ నటుడు కార్తికేయ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని