షూటింగ్‌లో గోల్డ్‌మెడల్‌ గెలుచుకున్న హీరో అజిత్‌ - ajith wins gold at 46th tamil nadu state shooting championship
close
Published : 08/03/2021 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

షూటింగ్‌లో గోల్డ్‌మెడల్‌ గెలుచుకున్న హీరో అజిత్‌

చెన్నై: షూటింగ్‌ పోటీల్లో ప్రముఖ నటుడు, అగ్ర కథానాయకుడు అజిత్‌ బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. తమిళనాడు స్టేట్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో చెన్నై రైఫిల్ క్లబ్‌ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ అజిత్‌ పాల్గొని అద్భుత ప్రదర్శన కనబరిచారు. పోటీల్లో భాగంగా ఆయన ఆరు పతకాలను గెలుచుకోగా.. అందులో నాలుగు స్వర్ణ పతకాలు. తమిళనాడులో జరిగిన ఈ పోటీలకు సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. నెటిజన్లు అజిత్‌కు అభినందనలు తెలుపుతున్నారు. మరోవైపు, అజిత్‌కు షూటింగ్‌ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన చెన్నై రైఫిల్ క్లబ్‌లో పలుమార్లు గేమ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించారు.

‘నేర్కొండ పార్వై’ తర్వాత అజిత్‌ నటిస్తున్న చిత్రం ‘వలిమై’. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీకపూర్‌ నిర్మాత. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు అందిస్తున్నారు. టాలీవుడ్‌ నటుడు కార్తికేయ ఈ సినిమాలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని