అడవిలో ‘ఆకాశవాణి’ - akasavaani teaser out now
close
Published : 06/03/2021 07:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అడవిలో ‘ఆకాశవాణి’

హైదరాబాద్‌: అదొక కారడవి. అందులో ఓ చిన్న గ్రామం. అమాయకులైన ఆ ఊరి జనం. వాళ్లు దేన్నో చూసి భయపడుతున్నారు. ఒకాయన ఇక్కడేదో తప్పు జరుగుతుందనీ చెబుతున్నాడు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? ఎవరిని చూసి భయపడుతున్నారు ఆ ఊరి జనం? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే ‘ఆకాశవాణి’ ప్రపంచాన్ని చూడాల్సిందే. రాజమౌళి శిష్యుడు అశ్విన్‌ గంగరాజు తెరకెక్కిస్తున్న చిత్రమిది. సముద్రఖని, వినయ్‌ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పద్మనాభ రెడ్డి నిర్మాత. ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ‘‘తాజా దృశ్యాలు, శబ్దాలు. అశ్విన్‌ తన తొలి చిత్రంతో ఏం సృష్టించాడో చూడటానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నా’’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘నిర్ణీత కాలం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. దీనికి సంగీతం: కాలభైరవ, సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: సురేష్‌ రగుతు, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని