Akkineni Akhil: ‘అయ్యగారు’  మిమ్మల్ని త్వరలోనే కలుస్తా - akhil about ayyagaru and his fan nagaraju from guntur twitter
close
Published : 19/10/2021 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Akkineni Akhil: ‘అయ్యగారు’  మిమ్మల్ని త్వరలోనే కలుస్తా

నాకా బిరుదు ఇచ్చావ్‌, నా అంత క్రేజ్‌ని సంపాదించుకున్నావ్‌.. సంతోషంగా ఉంది
ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో వీరాభిమానిని గురించి అఖిల్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్‌ని పసి వయసులో మనందరం ‘సిసింద్రీ’గా ముద్దుగా పిలుచుకున్నాం. ఇండస్ర్టీలోకి అడుగుపెట్టాక మాత్రం.. ‘అయ్యగారు’ అని పేరు పెట్టి పిలవడం మొదలుపెట్టారు. అది కాస్త ఎంతలా ఫేమస్‌ అయిందంటే.. గూగుల్‌లో అయ్యగారు అని సెర్చ్‌ చేస్తే.. అక్కినేని అఖిల్‌ అని చూపించేంతగా... మరింత అంతగా పేరు తెచ్చిన ఈ బిరుదుని ఏ ప్రముఖుడో ఇచ్చారనుకుంటే పొరపాటే. గుంటూరుకి చెందిన నాగరాజు అనే అఖిల్‌ వీరాభిమాని అఖిల్‌ని ‘అయ్యగారు’ అని పిలవడం మొదలుపెట్టాడు. ‘హలో’ చిత్రం చూశాక ఈ పేరుని పెట్టేశాడీ అభిమాని. అంతే ఒక్కసారిగా అఖిల్‌ వీరాభిమానిగా  సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయిపోయాడు. .తాజాగా థియేటర్లలో సందడి చేస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ని వీక్షించిన ఈ డై హార్డ్ ఫ్యాన్ మరో సారి వార్తల్లో నిలిచాడు. సోమవారం ఇన్‌స్టా లైవ్‌లో తన అభిమాని నాగరాజు గురించి మాట్లాడుతూ.. ‘‘ నాగరాజు మిమల్ని కచ్చితంగా కలవాలి. మీకో దణ్ణం అసలు. మీ వీడియోలను చూశాను. నాకన్నా ఫేమస్‌ అయిపోయారు మీరు. మీరిచ్చిన ‘అయ్యగారు’ అనే పదం నాలైఫ్‌ని టేక్‌ఓవర్‌ చేసింది. మా సినిమాల్లో కూడా పెట్టారు. మీరు కూడా ఇంత ఫేమస్‌ అయినందుకు సంతోషం ఉంది. ట్రోల్స్‌లో మీమ్స్‌లో ‘అయ్యగారు’ అని మొదలైనా.. సడెన్‌గా పాజిటివిని తీసుకొచ్చింది. మిమల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నా. క్షేమంగా ఉండండి. మీరు ఎప్పుడూ అదే ఉత్సాహాన్ని కలిగివుండండి. మీ ఆదరణ అభిమానానికి ఇదే నా కృతజ్ఞతలు’’ అన్నారు. అంతే ఇక సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా అయ్యగారి పై మీమ్స్‌ మొదలైయ్యాయి. వాటిని మీరు చూసేయండి.








Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని