అటు అఖిల్‌.. ఇటు రవితేజ ప్రీలుక్స్‌తో సందడి - akhil akkineni and ravi teja shares pre look
close
Updated : 11/07/2021 17:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అటు అఖిల్‌.. ఇటు రవితేజ ప్రీలుక్స్‌తో సందడి

ఇంటర్నెట్‌డెస్క్‌: అఖిల్‌ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్‌’ పేరుతో ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో అఖిల్‌ ఓ డిఫరెంట్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో పాత్ర కోసం ఆయన కండలు పెంచారు. తాజాగా చిత్ర బృందం అఖిల్‌ లుక్‌ను విడుదల చేసింది. అందులో అఖిల్‌ కండలు తిరిగిన దేహంతో జిమ్‌లో కసరత్తులు చేస్తూ వెనక్కి తిరిగి నిలబడ్డారు. హాలీవుడ్‌ హీరోలను తలదన్నేలా ఆయన శరీరం ఉందని అభిమానులు అంటున్నారు. ‘ఇది ఆరంభం మాత్రమే. మీకు ముందు ముందు ఉంది పండగ’ అంటూ సురేందర్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అయింది.

ఇక రవితేజ కథానాయకుడిగా సతీష్‌ మండవ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇంతకుముందెన్నడూ చేయని పాత్రలో రవితేజ నటిస్తున్నట్లు సమాచారం. కాగా, ఆదివారం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రెండు చేతులతో రవితేజ పుస్తకంపై ఏదో రాస్తున్నారు. ఇందులో రవితేజ తహసీల్దార్‌ కనిపిస్తారని టాక్‌. సోమవారం ఉదయం 10.08గంటలకు ఫస్ట్‌లుక్‌ విడుదల చేయనున్నారు. మరి ఆయన చేయబోయే పాత్ర ఏంటి? అసలు #RT68 కథేంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని