టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ కూడా రానుందా? - akhil akkineni new movie launch in this week
close
Published : 05/04/2021 15:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ కూడా రానుందా?

హైదరాబాద్‌: ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రం తర్వాత అఖిల్‌ అక్కినేని నటించనున్న కొత్త చిత్రం ఇప్పటికే ఖరారైంది. ఆయన సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మించనున్నారు. కథానాయికగా సాక్షి వైద్య నటించనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు తుది దశకు చేరుకోవడంతో.. ఇప్పుడీ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఈ వారంలోనే పట్టాలెక్కనుందని సమాచారం. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్‌ వేదికగా ‘ఏఎస్‌ లోడింగ్‌’ అంటూ ఓ హింట్‌ ఇచ్చేసింది.

ఈ వారంలోనే చిత్ర టైటిల్‌తో పాటు అఖిల్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఓ విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. ఈ సినిమా కోసమే అఖిల్‌ తన లుక్‌ని కూడా మార్చుకున్నారు. దీంట్లో ఆయన కండలు తిరిగిన దేహంతో మునుపెన్నడూ చూడని విధంగా కొత్తగా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని