క్వారంటైన్‌లో అఖిల్‌.. పూజ ఇలా! - akhil and pooja qurantine look for most eligible bachelor
close
Published : 29/07/2020 19:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్వారంటైన్‌లో అఖిల్‌.. పూజ ఇలా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్వారంటైన్‌లో మీరేం చేశారు అని అడిగితే.. చెప్పడానికి చాలా ఉంటాయి. కొత్త పనులు కొంతమంది నేర్చుకుంటే, ఇంకొంతమంది పాత పనులకు పదును పెట్టారు. మరి ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌’, ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలరేట్‌’ ఏం చేశారో తెలుసా అంటూ టీజర్‌ ట్వీట్‌లు చేసిన ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌’ టీమ్‌ పోస్టర్‌తో సమాధానమిచ్చింది. సినిమా నాయకానాయికలు అఖిల్‌, పూజా హెగ్డే కాంబినేషన్‌లో కొత్త పోస్టర్‌ను ట్వీట్‌ చేస్తూ సినిమా విడుదల తేదీని కూడా చెప్పింది. 

అఖిల్‌ చేతిలో కాఫీ కప్పుతో ల్యాప్‌టాప్‌లో  బిజీగా ఉండగా... వెనుక పూజ హెగ్డే వయ్యారంగా అఖిల్‌ను కవ్విస్తూ, డిస్ట్రబ్ చేస్తున్నట్లుగా పోస్టర్‌ను రూపొందించారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామంటూ పోస్టర్‌ మీద ‘పొంగల్‌ 2021’ అని రాశారు. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్‌ నిర్మిస్తోంది. గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు బన్ని వాసు నిర్మాత.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని