అఖిల్‌ అభిమానులకు ‘కిక్‌’ ఇస్తాడా? - akhil likely to work with surender reddy
close
Published : 13/08/2020 14:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అఖిల్‌ అభిమానులకు ‘కిక్‌’ ఇస్తాడా?

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమా విజయం సాధిస్తే వచ్చే ఆనందమే వేరు. అటు హీరోకు, ఇటు అభిమానులకు అదో కిక్‌. అయితే అలాంటి కిక్‌ను అనుభవించాలని చూస్తున్న హీరోల్లో అఖిల్‌ ఒకడు. ‘అఖిల్‌’తో మొదలైన ప్రయాణంలో ఇప్పటివరకు సరైన విజయం దక్కలేదు. దీంతో సినిమా కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. అలా ఎంచుకున్నదే ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌’. ఇప్పుడు అంతే ఆలోచించి మరో సినిమాకు ఓకే చెప్పేశాడట అక్కినేని చిన్నోడు. 

‘సైరా’తో భారీ విజయం అందుకున్న సురేందర్‌ రెడ్డితో అఖిల్‌ తర్వాతి సినిమా ఉండబోతోందనేది టాలీవుడ్‌ వర్గాల సమాచారం. స్టైలిష్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సురేందర్‌ రెడ్డి ‘సైరా’ తర్వాత ఇంకా కొత్త సినిమా ప్రారంభించలేదు. ఆ హీరో, ఈ హీరో అంటూ రకరకాల పేర్లు వినిపించినా ఏదీ సినిమా రూపం దాల్చలేదు. ఇప్పుడు అఖిల్‌కు ఓ కథ చెప్పారని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ సినిమా విషయంలో ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం అఖిల్‌ బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’లో నటిస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా పోస్టర్‌ ఇటీవల విడుదలైంది. పూజా హెగ్డే, అఖిల్‌ రొమాంటిక్‌గా ఉన్న ఆ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని