బ్యాచ్‌లర్‌ వచ్చేది అప్పుడే! - akhil most eligible bachelor ready for summer
close
Published : 12/01/2021 09:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాచ్‌లర్‌ వచ్చేది అప్పుడే!

హైదరాబాద్‌: అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. పూజా హెగ్డే కథానాయిక.  బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమాని వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకో షెడ్యూల్‌ చిత్రీకరణ మిగిలి ఉంది. ఈ నెలాఖరుతో పూర్తయ్యే ఆ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు.

మొదట సంక్రాంతికే ఈ సినిమాని విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వేసవి లక్ష్యంగా ముస్తాబవుతోంది. యువతరానికి నచ్చే అంశాలు, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బ్యాచ్‌లర్‌గా అఖిల్‌ చేసే సందడి ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆమని, మురళీశర్మ, జయప్రకాశ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, ఛాయాగ్రహణం: ప్రదీశ్‌ ఎమ్‌.వర్మ. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని