close
Published : 23/04/2021 13:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అజయ్‌ భూపతి దర్శకత్వంలో అఖిల్‌?

ఇంటర్నెట్‌ డెస్క్: అక్కినేని అఖిల్‌ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్‌’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకి సంబంధించి అఖిల్ స్టిల్స్ సైతం విడుదలయ్యాయి. అందులో అతడు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఓ చిత్రంలో అఖిల్‌ నటించనున్నాడట. ఈ చిత్రానికి అజయ్‌ భూపతి దర్శకత్వం చేయనున్నారనే వార్తలొస్తున్నాయి. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం అఖిల్ - పూజాహెగ్డే  కలిసి జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 19న తెరపైకి రానుంది. మరోవైపు అజయ్‌ భూపతి ‘మహాసముద్రం’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా నటిస్తుండగా, అతిదిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నాయికలుగా నటిస్తున్నారు.  

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని